నిజమైన నాయకుడు

ABN , First Publish Date - 2021-01-22T05:36:54+05:30 IST

నాయకుడు సమర్ధుడైతే అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం.

నిజమైన నాయకుడు

నాయకుడు సమర్ధుడైతే అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం.


అవని విభుండు నేరుపరియైు చరియించిన గొల్చువార లె

ట్లవగుణులైన నేమి? పనులన్నియు జేకుఱు వారి చేతనే

ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే

దవిలి యొనర్పవే? జలధి దాటి సురారులంద్రుంచి భాస్కరా!


నాయకుడు సరైన వాడైతే, ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలిసిన వాడైతే, చిన్న చిన్న లోపాలకు కంగారు పడిపోకుండా నిలబడే వాడైతే అన్ని పనులూ చక్కబెట్టుకోగలడు. దానికి ఉదాహరణ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న నాయకుడు రాముడు. ఆయన చుట్టూ ఉన్నది వానరసైన్యం.


 ఆయన చుట్టూ ఉన్నది వానరసైన్యం. ఆ సైన్యంతోనే వారధి కట్టించాడు. సముద్రం దాటించాడు. ఆ వానరాలను రాక్షసులతో యుద్ధం చేయించాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడయ్యాడు. కిందివాళ్లు ఎలాంటి వాళ్లయినా నడిపే వాడు సరైన వాడైతే బెంగపడక్కర్లేదు. 

 గరికిపాటి నరసింహారావు


Updated Date - 2021-01-22T05:36:54+05:30 IST