కేసీఆర్‌ పాలనలో నిజమైన రైతు రాజ్యం

ABN , First Publish Date - 2021-04-14T04:33:27+05:30 IST

ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం నిజమైన రైతు రాజ్యంగా ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ పాలనలో నిజమైన రైతు రాజ్యం
గద్వాలలో బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 

- ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 13 : ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం నిజమైన రైతు రాజ్యంగా ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్లవనామ సంవత్సరం ఉ గాది పర్వదినం సందర్భంగా పట్టణంలోని ఎనిమి ది, 32  వార్డుల పరిధిలో మంగళవారం నిర్వహిం చిన జోడెద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా ఎద్దులకు ప్రత్యేక పూ జలు చేశారు. కరోనా లాక్‌డౌన్‌లో అన్ని రంగాలు నిలిచిపోయినా, వ్యవసాయ రంగం మాత్రం నిరం తరాయంగా సాగిందన్నారు. ప్లవ నామ సంవత్స రంలో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల వారు, ప్రజలు సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో సు ఖ జీవనం సాగించాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, కౌన్సిలర్లు జయమ్మ కో టేష్‌, కృష్ణ, మురళీ, నాగిరెడ్డి, నాయకులు గోవిందు, సుకూర్‌, ధర్మనాయుడు, కృష్ణ, వీరేష్‌, రాజా, శివ శంకర్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

 రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మల్దకల్‌: ప్రభుత్వం రైతులకు అండగా ఉండి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మల్దకల్‌లో కొత్తగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంగళవారం ఎ మ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన సమగ్ర స మాచారం అందించేందుకు, శాస్త్రవేత్తలు సూచన లు, సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతువేదికల ను నిర్మించిందన్నారు.

Updated Date - 2021-04-14T04:33:27+05:30 IST