Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.64 లక్షల ప్యాకేజీతో ఓ కంపెనీ జాబ్ ఆఫర్.. చేసే పనేంటో తెలిస్తే అవాక్కవకుండా ఉండలేరు..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ యూకేకి చెందిన ఓ కంపెనీ మాత్రం.. భారీ మొత్తంలో జీతం ఆఫర్ చేస్తూ ఉద్యోగుల కోసం ప్రకటన విడుదల చేసింది. లక్షల్లో జీతాలను ఆఫర్ చేస్తున్న ఆ కంపెనీ.. ఏ సాఫ్ట్‌వేర్ సంస్థో అయ్యింటుందిలే, నిపుణుల కోసం ఆ ప్రకటన ఇచ్చిందేమోలే అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అది ఐటీ సంస్థ కాదు.. ఓ ఫార్మింగ్ కంపెనీ. బ్రిటన్‌కు చెందిన ఫార్మింగ్ కంపెనీ.. ప్యాకింగ్ పని చేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలను ఆఫర్ చేస్తూ రిక్రూట్‌మెంట్‌కు ప్రకటన విడుదల చేసింది. ప్యాకింగ్ పని చేసే వారికి లక్షల్లో జీతాలను ఏ కంపెనీ ఆఫర్ చేస్తుందని ఆలోచిస్తున్నారా! అయితే మరెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పదండి..


బ్రిటన్‌కు చెందిన ఫార్మింగ్ కంపెనీ టిహెచ్ క్లెమెంట్స్ & సన్ లిమిటెడ్ తాజాగా ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పొలంలో పండించిన క్యాబేజీలను తెంపి, ప్యాకింగ్ చేసేందుకు ఉద్యోగులు కావాల్సిందిగా అందులో పేర్కొంది. ఈ రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఏడాదికి 62,400 పౌండ్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.63లక్షల 20వేలు) జీతం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా.. టిహెచ్ క్లెమెంట్స్ & సన్ లిమిటెడ్ చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ విషయం హాట్ టాపిక్ అవ్వడంతో.. స్పందిస్తున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement