Abn logo
Sep 23 2021 @ 11:58AM

అర్ధరాత్రి ప్రియుడిని బయటకు రప్పించిన యువతి.. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె చేసిన దారుణం ఏంటంటే..

వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.. కొద్ది రోజులుగా కలిసి తిరుగుతున్నారు.. సోమవారం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రియుడు, తర్వాతి రోజు ఉదయాన్నే ఇంటికి కొద్ది దూరంలోనే రోడ్డు మీద స్పృహ కోల్పోయి కనిపించాడు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లేసరికే మరణించాడు.. దీంతో యువతి కుటుంబంపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


బరాన్ నగరానికి చెందిన రాజ్‌కుమార్ మంగళవారం ఉదయం తన ఇంటికి సమీపంలో రోడ్డు మీద పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న అతడి తండ్రి మోతీలాల్ వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే రాజ్‌కుమార్ మరణించాడు. దీంతో మోతీలాల్ పోలీసులను ఆశ్రయించాడు. సోనియా అరేవాల్ అనే యువతితో తన కుమారుడు ప్రేమలో ఉన్నాడని, ఆమె కుటుంబమే తన కొడుకును చంపిందని ఫిర్యాదు చేశాడు. 


ఇవి కూడా చదవండి

ఆమె తిరస్కరించిందని అతను ఎంతటి నీచానికి తెగించాడంటే..



ప్రేమజంటకు సహకరించిందని దారుణం.. చితక్కొట్టి, యాసిడ్ పోసి..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అనంతరం సోనియా అరేవాల్, ఆమె తండ్రి జితేంద్ర, తల్లి మమత, నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా బయటకు రాలేదు. తన కొడుకు రాజ్‌కుమార్‌తో ప్రేమాయణం సాగించిన సోనియాకు పెళ్లి సంబంధం కుదిరిందని, దీంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు సోనియా కుటుంబం ఇంతకు తెగించిందని మోతీలాల్ చెబుతున్నాడు. 

ప్రత్యేకంమరిన్ని...