Pregnancy Test చేసుకున్న భార్య.. పాజిటివ్ అని రావడంతో ఆ కిట్‌ను తీసుకుని ఐస్‌క్రీమ్‌లో దాచి.. Viral Video

ABN , First Publish Date - 2021-10-07T20:47:12+05:30 IST

ఇష్టపడిన వాడిని పెళ్లాడిన ఓ మహిళ.. తమకు పుట్టబోయే పిల్లలతో ‘అమ్మా’ అని పిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె నెలతప్పింది. ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కన్ఫామ్ చేసుకున్న ఆమె.. ఆ వి

Pregnancy Test చేసుకున్న భార్య.. పాజిటివ్ అని రావడంతో ఆ కిట్‌ను తీసుకుని ఐస్‌క్రీమ్‌లో దాచి.. Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఇష్టపడిన వాడిని పెళ్లాడిన ఓ మహిళ.. తమకు పుట్టబోయే పిల్లలతో ‘అమ్మా’ అని పిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె నెలతప్పింది. ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కన్ఫామ్ చేసుకున్న ఆమె.. ఆ విషయాన్ని తన భాగస్వామికి ఎలా చెప్పాలని తీవ్రంగా ఆలోచించింది. ఈ నేపథ్యంలో ఆమెకో ఉపాయం వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి.. భర్తను సర్‌ప్రైజ్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 



లీసా అనే మహిళ కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తిని ఇష్టపడి పెళ్లాడారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా నెల తప్పారు. ఆ గుడ్‌న్యూస్‌ను తన భర్తకు ఎలా చెప్పాలని ఆమె తీవ్రంగా ఆలోచించారు. చివరగా.. ఆమెకో ఐడియా వచ్చింది. ఆ ఐడియాలో భాగంగానే ఆమె తన భర్తను ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఓ ఐస్‌క్రీంలో తన ప్రెగెన్సీ కిట్‌ను పెట్టేసి, దాన్ని తన భర్తలో చేతిలో పెట్టేశారు. భార్య ఐస్‌క్రీం తెచ్చివ్వడంతో.. అతడు పొంగిపోయాడు. ఆ ఐస్‌క్రీం తీసుకుని తినడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి.. ప్రెగ్నెన్సీ కిట్ కనిపించింది. దీంతో ఇదేంటీ ఐస్‌క్రీంలో ప్రెగ్నెన్సీ కిట్ వచ్చింది అనుకుంటూ అతడు భార్య వంక చూశాడు. ఆమె సిగ్గుపడుతూ కనిపించడంతో అతడికి విషయం అర్థం అయింది. ఈ క్రమంలో అతడు ఒక్కసారిగా భావోద్వేనికి లోనయ్యాడు. కాగా.. సదరు మహిళ ఈ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీన్ని ఇప్పటి వరకు 14 మిలియన్ల మంది వీక్షించారు. 



Updated Date - 2021-10-07T20:47:12+05:30 IST