Viral Video: నడవలేని వృద్ధురాలిపై చిరుత దాడి.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-30T21:44:20+05:30 IST

ఇటీవల మనుషుల మీద క్రూర మృగాలు దాడి చేయడం తరచూ చూస్తున్నాం. అడవులను నరికేస్తుండడంతో వన్యప్రానులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వాటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొందరు వీరోచితంగా

Viral Video: నడవలేని వృద్ధురాలిపై చిరుత దాడి.. చివరకు ఏం జరిగిందంటే..

ఇటీవల మనుషుల మీద క్రూర మృగాలు దాడి చేయడం తరచూ చూస్తున్నాం. అడవులను నరికేస్తుండడంతో వన్యప్రానులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వాటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొందరు వీరోచితంగా పోరాడడమో, లేదా అదృష్టవశాత్తు తప్పించుకోవడమో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే వృద్ధురాలు నడవడానికి కూడా ఇబ్బంది పడే స్థతిలో ఉంది. కనీసం ఎక్కవు సేపు నిలబడలేని పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు.. సేదతీరేందుకు అరుగుపై కూర్చుంది. అదే సమయంలో ఆమెపై ఓ చిరుత దాడి చేసింది. 


ముంబైలోని అరేయ్ డెయిరీ ప్రాంతంలో నిర్మలాదేవీ సింగ్ అనే వృద్ధురాలు.. కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె సరిగ్గా నడవలేని పరిస్థితి. బుధవారం రాత్రి 7గంటల సమయంలో తమ ఇంటి ఆవరణలో అరుగుపై కూర్చుని ఉంది. అప్పటికే ఈమెను ఓ చిరుత గమనిస్తూ, దాడి చేయాలని కాపు కాసి ఉంది. వృద్ధురాలు అరుగుపై కూర్చున్న కొద్దిసేపటికి.. ఆమె దాడికి యత్నించింది. ఊహించని ఆ పరిణామానికి వృద్ధురాలు షాక్‌కు గురైంది. ఆ సమయంలో వేరే వారు ఎవరున్నా.. అక్కడి నుంచి పరుగెత్తడమో, లేదా ఆ చిరుతకు బలవ్వడమో జరిగేది. కానీ వృద్ధురాలు మాత్రం అలా చేయలేదు.


చిరుత ఒక్కసారిగా పంజా విసరగానే వృద్ధురాలు కిందపడిపోయింది. అయితే వెంటనే షాక్ నుంచి తేరుకుని.. తన చేతిలోని కర్రతో చిరుత మూతి మీద ఒక్కటిచ్చింది. తిరగబడుతున్న చిరితపై మళ్లీ ఇంకో దెబ్బ కొట్టడంతో.. చిరుత తోక ముడిచింది. వృద్ధురాలి దెబ్బ రుచి చూసిన ఆ చిరుత.. అక్కడి నుంచి పరుగందుకుంది. అనంతరం నిర్మలా దేవి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. విషయం తెలుసుకుని వృద్ధురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


నిర్మలా దేవిని పరిశీలించిన వైద్యులు.. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. కేవలం కాలికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే చిరుత దాడి దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో.. వృద్ధురాలి ధైర్య సాహసాలను అంతా మెచ్చుకుంటున్నారు. సివంగి అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.



Updated Date - 2021-09-30T21:44:20+05:30 IST