ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంకు ఎక్కిన మహిళ

ABN , First Publish Date - 2021-04-19T06:13:34+05:30 IST

భూమి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంకు ఎక్కింది.

ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంకు ఎక్కిన మహిళ
మహిళతో మాట్లాడుతున్న ఎస్‌ఐ ఉపేందర్‌

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 18: భూమి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంకు ఎక్కింది. సుల్తానాబాద్‌ మండలం కనుకల గ్రామానికి చెందిన కోట రమాదేవిని మండలంలోని పూసాల గ్రామానికి చెందిన కోట శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చి 15 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో పిలలతో పాటు రమాదేవి కనుకులలో ఉంటోంది. శ్రీని వాస్‌ రెడ్డి పేరిట ఉన్న వ్యవసాయ భూమిని గతంలో చెప్పిన విధంగా పిల్లల పేరిట కాకుం డా అతని తమ్ముడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేం దుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. ఈ విష యంలో తనకు అన్యాయం జరిగింది. పోలీసుస్టేషన్‌లో కేసు ఉ న్నా న్యాయం చేయడం లేదని రమాదేవి ఇద్దరు పిల్లలతో కలిసి సుల్తానాబాద్‌ పట్టణంలోని బాలికల హైస్కూల్లో ఉన్న వాటర్‌ ట్యాంకు ఎక్కింది. సమాచారం అందుకున్న ఎస్సై ఉపేందర్‌రావు అక్కడకు చేరుకొని నచ్చజెప్పడంతో మహిళ కిందకు దిగివచ్చిం ది. తహసీల్దార్‌ పాల్‌సింగ్‌, ఎస్‌ఐ ఉపేందర్‌రావులు మాట్లాడు తూ దంపతుల మధ్య పోలీస్‌స్టేషన్‌లో కేసు నడుస్తోందని, నెల రోజుల క్రితం భూమి గురించి ఫిర్యాదు చేసిందని తెలిపారు.  

Updated Date - 2021-04-19T06:13:34+05:30 IST