Abn logo
Nov 25 2021 @ 21:07PM

వీధుల్లో భిక్షాటన చేస్తున్న మహిళ.. అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతోంది.. ఆమె గతం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఇంటర్నెట్ డెస్క్: వీధుల్లో భిక్షం అడుకున్నే ఓ మహిళ‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఆ మహిళ.. అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటాన్ని చూసి అవాక్కవుతున్నారు. అంతేకాకుండా ఆమె గతాన్ని తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. కాగా.. ఇంతకూ ఆ మహిళ ఎవరు.. ఆమె గతం ఏంటి.. వీధుల్లో భిక్షం అడుక్కునే పరిస్థితి ఆమెకు ఎందుకు కలిగింది అనే వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వీధుల్లో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకునే ఓ మహిళ.. ఏ మాత్రం తడబాటు లేకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడాన్ని చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. ఈ క్రమంలోనే ఆమెను పలకరించాడు. దీంతో ఆమె తన గతాన్ని అతడితో పంచుకుంది. తన పేరు స్వాతి అని.. తాను కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశానని తెలిపింది.


అంతేకాకుండా తనకు పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని పేర్కొంది. డెలివరీ సమయంలో పక్షవాతం రావడంతో.. దక్షిణ భారతదేశం నుంచి మూడేళ్ల క్రితం వారణాసికి వచ్చినట్టు వెల్లడించింది. కడుపు నింపు కోవడం తప్పక భిక్షాటన చేస్తున్నట్టు వివరించింది. స్వాతి తన వివరాలను ఇంగ్లీష్‌లో చెప్తున్నప్పుడు సదరు వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా.. ‘స్వాతి మానసికంగా ఆరోగ్యంగానే ఉంది. ఆమె నా వద్ద డబ్బు తీసుకోలేదు కానీ.. ఏదైనా పని ఇప్పించుమని కోరింది. టైపింగ్, కంప్యూటర్ సంబంధిత పనులు ఆమె చేయగలదు. ఆమె మంచి జీవితాన్ని కోరుకుంటోంది’ అని పేర్కొన్నాడు. దీంతో స్వాతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా వైరల్‌గా మారింది. 



ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...