Abn logo
Mar 28 2021 @ 00:22AM

ఏడాది తర్వాత ముగిసింది!

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అత్రంగీ రే’ షూటింగ్‌ పూర ్తయింది. ఈ విషయాన్ని హీరోయిన్‌ సారా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అక్షయ్‌, ధనుష్‌ గొప్ప నటులు అని ప్రశంసించారు. తనను గైడ్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సెట్‌లో ధనుష్‌, అక్షయ్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఏడాది తర్వాత సినిమా షూటింగ్‌ ముగిసింది. మంచి టీమ్‌తో పనిచేసిన అనుభవం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. సారా ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా నటించారు. ఈ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు.