Oct 23 2021 @ 20:29PM

Ananya Panday ను పరామర్శించేందుకు వెళ్తూ వాళ్ల ఇంటికి పూల బొకేను తీసుకెళ్తున్న యువ హీరో

సినిమా ఇండస్ట్రీలోని వారు ఒకరికి మరొకరు చేదోడు వాదోడుగా ఉంటారు. కరణ్ జోహార్- షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్- ఆదిత్య చోప్రా, అర్జున్ కపూర్ -రణ్ వీర్ సింగ్ తదితరులు ఒకరికి ఆపద వచ్చినా వెంటనే మరొకరు వెళ్లి ఆదుకుంటారు. సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ స్నేహ బంధం గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. 


ఒక సినిమాలో నటించినప్పుడు హీరో, హీరోయన్ల మధ్య స్నేహం చిగురించడం సాధారణమే. ‘‘ కాలీ పీలీ ’’ చిత్రంలో నటించి స్నేహితులుగా మారిన వారే అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్. ఈ ఇషాన్ ఖట్టర్ ఎవరో కాదు షాహిద్ కపూర్ సోదరుడు. అతడు ‘‘ దఢక్’’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించాడు. ‘‘కాలీ పీలీ ’’ సినిమా నుంచే అనన్య, ఇషాన్ డేటింగ్ చేస్తున్నట్టు  బాలీవుడ్ మీడియాలో వదంతులు షికార్లు చేస్తున్నాయి.


అనన్యను పరామర్శించేందుకు వాళ్ల ఇంటికి వెళ్తూ ఇషాన్ పూల బొకేను కొనుగోలు చేశాడు. అతడు పింక్, వైట్ పూల బొకేను కొన్నాడు. అనంతరం కారులో బాలీవుడ్ యువనటి అయిన అనన్య పాండే ఇంటికి వెళ్లాడు.


ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో భాగంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో( ఎన్సీబీ) అధికారులు అనన్యను గత 2రోజులుగా ప్రశ్నిస్తున్నారు. షారూఖ్ తనయుడైన ఆర్యన్‌ను డిసెంబరు 3న ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు.

ఎన్సీబీ అధికారుల ప్రశ్నలకు అనన్య..‘‘ నేను ఆర్యన్‌కు ఎటువంటి డ్రగ్స్‌ను  సరఫరా చేయలేదు. ఎప్పుడు డ్రగ్స్‌ను కూడా వాడలేదు’’ అని సమాధానమిచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘‘ లైగర్ ’’ చిత్రంలో ఆమె నటిస్తోంది. మరొకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇషాన్ చివరగా మీరా నాయర్ తెరకెక్కించిన ‘‘ ఏ సూటబుల్ బాయ్ ’’ లో కనిపించాడు. Bollywoodమరిన్ని...