Shock: భార్యను కిడ్నాప్ చేశారని అత్త, మామలపై కేసు.. తీరా ఇంటికొచ్చి చూసిన అతను.. అలా జరుగుతుందని ఊహించలేదు..

ABN , First Publish Date - 2021-10-11T02:03:56+05:30 IST

అమృతహళ్లి బాలాజీ లేఅవుట్‌లో ఉంటున్న సునీల్ కుమార్‌కు వర్ష అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం.. కళాశాలలో పరిచయమైంది. తర్వాత వారి మధ్య ప్రేమ మొదలై.. పెళ్లి వరకూ వెళ్లింది. అయితే

Shock: భార్యను కిడ్నాప్ చేశారని అత్త, మామలపై కేసు.. తీరా ఇంటికొచ్చి చూసిన అతను.. అలా జరుగుతుందని ఊహించలేదు..

ప్రేమ వివాహాలు.. చాలా మంది పెద్దలకు నచ్చవు. అందుకే చాలా ప్రేమకథల్లో పెద్దలే ఎక్కువగా విలన్లుగా కనిపిస్తారు. ప్రేమ వివాహం అని తెలిస్తే.. అమ్మాయి తరపు వారో లేదా అబ్బాయి తరపు వారో.. బెదిరించడం, దాడి చేయడం చేస్తుంటారు. ఇలాగే బెంగళూరులోని అమృతహళ్లిలో ఓ ఘటన జరిగింది. అయితే చివరకు తాను ఊహించనిది జరగడంతో ఆ ప్రేమికుడు షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..


అమృతహళ్లి బాలాజీ లేఅవుట్‌లో ఉంటున్న సునీల్ కుమార్‌కు వర్ష అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం.. కళాశాలలో పరిచయమైంది. తర్వాత వారి మధ్య ప్రేమ మొదలై.. పెళ్లి వరకూ వెళ్లింది. అయితే వారి కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు వారు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది ఆగస్టులో పెద్దలకు తెలీకుండా ఓ ఆలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తర్వాత నుంచి కలిసే ఉంటున్నారు.


అయితే రోజూ వారిని ఎవరో అనుసరిస్తున్నట్లు అనుమానం కలిగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 15న వర్ష, కుమార్ కలిసి బయటకు వెళ్లారు. ఆ సమయంలో వర్ష కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యక్తి.. వారిని కారులో అనుసరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో భయపడ్డ దంపతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తర్వాత కొన్నాళ్లు ఎలాంటి సమస్యా లేదు. 


ఈ క్రమంలో మళ్లీ అక్టోబర్ 6న ఓ కారు, ఆరు బైకుల్లో కొంత మంది వచ్చి కుమార్‌పై దాడి చేసి వర్షను కిడ్నాప్ చేశారు. దీనిపై బాధితుడు అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన అత్త, బావమరుదులు కలిసి తన భార్యను కిడ్నాప్ చేశారని ఆరోపించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే కుమార్ ఇంటికి రాగానే తన భార్య క్షేమంగా కనిపించడం చూసి షాక్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన తర్వాత ఏమనుకున్నారో ఏమో గానీ.. మొత్తానికి తమ కుమార్తెను మళ్లీ కుమార్ ఇంటి వద్దే విడిచి వెళ్లారు. చివరికి పెద్దలే తమ ప్రేమకు తల వంచారని దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-11T02:03:56+05:30 IST