ఆర్మీలో చేరాలన్న ఆశలన్నీ ఆవిరి.. ఓ కన్ను కోల్పోయి దీనస్థితిలో ఈ యువతి ఉండటం వెనుక..

ABN , First Publish Date - 2022-01-24T21:11:50+05:30 IST

ఆ యువతిది మారుమూల గ్రామం. చదువు పూర్తయ్యాక ఆర్మీలో ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది. అందుకు తగినట్టే తీవ్రంగా శ్రమించేది. రోజూ ఉదయాన్నే నిద్రలేచి 2-3 కిలోమీటర్లు పరుగులు తీ

ఆర్మీలో చేరాలన్న ఆశలన్నీ ఆవిరి..  ఓ కన్ను కోల్పోయి దీనస్థితిలో ఈ యువతి ఉండటం వెనుక..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతిది మారుమూల గ్రామం. చదువు పూర్తయ్యాక ఆర్మీలో ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది. అందుకు తగినట్టే తీవ్రంగా శ్రమించేది. రోజూ ఉదయాన్నే నిద్రలేచి 2-3 కిలోమీటర్లు పరుగులు తీసేది. ఎప్పటిలాగే ఓ రోజు ఉదయం రన్నింగ్‌కు వెళ్లిన ఆమె జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. ఆ రోజు జరిగిన సంఘటన ఆమె ఆశలను ఆవిరి చేసింది. ప్రస్తుతం ఒక కన్నును కోల్పోయి దీనస్థితిలో ఉన్న ఆ యువతికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని బక్సార్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామానికి చెందిన యువతి పేరు చంపా. స్థానికంగా ఉన్న కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఈ యువతి.. ఆర్మీలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రోజూ సాధన చేసేది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి.. 2-3 కిలోమీటర్లు పరుగులు తీసేది. ఎప్పటి లాగే గత ఏడాది నవంబర్ 12న ఉదయాన్నే గ్రౌండ్‌కు వెళ్లిన చంపా.. ఇంటికి తిరిగి రాలేదు. బైక్‌‌పై వచ్చిన నలుగురు యువకులు ఆమెపై కత్తితో దాడి చేయడంతో ఆసుపత్రిలో చేరింది. ఈ దాడిలో ఒక కంటిని కోల్పోయిన చంపా.. ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటోంది. చంపా కంటిని కల్పోవడం వల్ల ఆర్మీలో చేరాలన్న తన ఆశలు ఆవిరయ్యాయి. 



కాగా.. చంపాపై దాడి జరిగిన విషయాన్ని తెలుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆమె నుంచి అప్పట్లో ఫిర్యాదు తీసుకున్నారు. 2017లో డిగ్రీ పరీక్షలు రాసున్నపుడు బబ్లూ అనే యువకుడు పరిచయం అయినట్టు చంపా తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రేమిస్తున్నానంటూ తరచూ వేధించేవాడని.. అయితే దానికి తాను అంగీకరించకపోవడంతో స్నేహితులతో కలిసి దాడి చేసినట్టు వెల్లడించింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు నెలలు గడుస్తున్నా బబ్లూను అతడి స్నేహితులను మాత్రం పట్టుకోలేకపోయారు. పోలీసుల పని తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న క్రమంలో జిల్లా ఎస్పీ స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే ఆ యువకులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-01-24T21:11:50+05:30 IST