Abn logo
Jun 19 2021 @ 01:33AM

ఇజ్రాయెల్‌ సైన్యంలో భారత సంతతి యువతి

గాజాపై దాడుల్లో పాల్గొన్న 20 ఏళ్ల నిత్షా


అహ్మదాబాద్‌, జూన్‌ 18: ఇజాయ్రెల్‌, పాలస్తీనాకు చెందిన హమస్‌ ఉగ్రవాద సంస్థకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయని అనుకునేంతలో గాజాపై మరోసారి ఇజ్రాయెల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌) దాడులతో విరుచుకుపడింది. తాజాగా బాంబుల వర్షం కురిపించిన ఐడీఎఫ్‌ బృందంలో 20 ఏళ్ల గుజరాత్‌ సంతతి యువతి ఉన్నారు. ఆమె పేరు నిత్షా ములియాషా. నిత్షా పూర్వీకులది రాజ్‌కోట్‌ సమీపంలోని కొఠారీ అనే చిన్న గ్రామం. ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్‌కు వెళ్లి ‘టెల్‌ అవివ్‌’లో స్థిరపడ్డారు. ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా 45 గుజరాతీ కుటుంబాలు ఉన్నాయి.


వీరిలో చాలా మంది వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి నిర్బంధ సైనిక శిక్షణ అనే కార్యక్రమంలో భాగంగా నిత్షా రెండేళ్ల క్రితం ఐడీఎ్‌ఫలో చేరారని తండ్రి జీవాభాయ్‌ ములియాషా చెప్పారు. తన కూతురు లెబనాన్‌, సిరియా, జోర్దాన్‌ సరిహద్దుల్లో పనిచేసిందని, ప్రస్తుతం గాజాలో దాడులు నిర్వహిస్తున్న ‘గుష్‌ దాన్‌’ ప్రాంతంలో ఆమె పనిచేస్తోందన్నారు.