22 ఏళ్లకే 12 పెళ్లిళ్లు.. 12వ భార్య కేసు పెట్టడంతో...

ABN , First Publish Date - 2021-01-16T22:11:52+05:30 IST

అతడి వయసు 22 ఏళ్లు. చూడడానికి అందంగా లవర్ బాయ్‌లా ఉంటాడు. ఫేస్‌బుక్‌లో యమా యాక్టివ్‌గా ఉంటాడు. అక్కడే ఓ అమ్మాయితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా...

22 ఏళ్లకే 12 పెళ్లిళ్లు.. 12వ భార్య కేసు పెట్టడంతో...

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు 22 ఏళ్లు. చూడడానికి అందంగా లవర్ బాయ్‌లా ఉంటాడు. ఫేస్‌బుక్‌లో యమా యాక్టివ్‌గా ఉంటాడు. అక్కడే ఓ అమ్మాయితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. చక్కగా కాపురం పెట్టారు. అయితే కొన్నాళ్లకు ఆమెకు అసలు విషయం తెలిసి షాక్ అయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన గణే‌శ్‌ అనే యువకుడికి ఫేస్‌బుక్‌లో లవ్లీ గణేశ్ పేరుతో ఓ ఖాతా ఉంది. ఆ ఖాతా ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకుని తనను ప్రేమిస్తునని చెప్పి పెళ్లికి ఒప్పించాడు. ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ ఇద్దరూ మేజర్లు కావడంతో వారు పోలీసు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారిద్దరూ ఒకటయ్యారు. 


కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత గణేశ్‌ నిజ స్వరూపం బయటపడింది. అతడికి తనకంటే ముందు 11 మందితో వివాహమైందని తెలిసి ఆ యువతి షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి గణేశ్‌ను అదుపులోనికి తీసుకున్నారు.

Updated Date - 2021-01-16T22:11:52+05:30 IST