ఆదమరిస్తే..అంతే సంగతులు!!

ABN , First Publish Date - 2021-06-19T05:37:41+05:30 IST

మండలంలోని ఆర్‌ఆర్‌ నగర్‌ గ్రామం శివారులోని శ్రీరాంసాగర్‌ కాకతీ య కాలువ వద్ద ఏర్పాటు చేసిన కల్వర్టు ఇరుకుగా మారింది. అంతేకాకుండా ఒక వైపు రక్షణగోడ (ప్రొటక్షన్‌ వాల్‌) లేకపోవడంతో ప్రమాదాలు పొంచిఉన్నా యి. ఆర్‌ఆర్‌ నగర్‌ వైపు నుంచి ఉప్లూర్‌ వైపు

ఆదమరిస్తే..అంతే సంగతులు!!
ఆర్‌ఆర్‌ నగర్‌ నుంచి ఉప్లూర్‌ వైపు వెళ్లే రహదారిపై ఇరుకుగా, రక్షణగోడ లేని కల్వర్ట్‌

ఆర్‌ఆర్‌ నగర్‌ కాకతీయ కల్వర్ట్‌ వద్ద తస్మాత్‌ జాగ్రత్త 

ఒకవైపు రక్షణగోడ లేకపోవడంతో  వాహనాలకు పొంచి ఉన్న ప్రమాదం

కమ్మర్‌పల్లి, జూన్‌ 18: మండలంలోని ఆర్‌ఆర్‌ నగర్‌ గ్రామం శివారులోని శ్రీరాంసాగర్‌ కాకతీ య కాలువ వద్ద ఏర్పాటు చేసిన కల్వర్టు ఇరుకుగా మారింది. అంతేకాకుండా ఒక వైపు రక్షణగోడ (ప్రొటక్షన్‌ వాల్‌) లేకపోవడంతో ప్రమాదాలు పొంచిఉన్నా యి. ఆర్‌ఆర్‌ నగర్‌ వైపు నుంచి ఉప్లూర్‌ వైపు వెళ్లే ఈ రహదారి కల్వర్ట్‌ వద్ద మట్టికొట్టుకు పోవడంతో పాటు రక్షణ గోడలేక పోవడంతో వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదా లు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నా యి. గతంలో శ్రీరాంసాగర్‌ కాకతీయ కాలువ నిర్మాణ సమయంలో ఆర్‌ఆర్‌నగర్‌, ఏర్గట్ల, తదిరత గ్రామాల ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఈ కల్వర్ట్‌ ప్రస్తుత పరిస్థిల్లో రవాణా పెరిగి ఇరకుగా మారింది. దీనికితోడు కల్వర్క్‌ఉ ఇరువైపులా ప్రమాద మలుపులు ఉన్నాయి. ఈ రహదారి గుండా పయనించే వాహనదారులకు కల్వర్టు ప్రాణసంకటంగా మారింది.  గోదావరి పుష్కరాల సమయంలో రోడ్డును అభివృద్ధిపర్చిన ఆర్‌ఆండ్‌బీ అధికారులు ఈ కల్వర్ట్‌ వద్ద రక్షణ గోడ నిర్మించలేదు. నిత్య, అలాగే, ప్రతీ శుక్రవారం వివిధ గ్రామాలు జిల్లాల నుంచి తడ్‌ పాకల్‌, గుమ్మిర్యాల్‌, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వర్షకొం డ, ఎర్దండి గ్రామాలలోని గోదావరి పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులతో బిజీ గా ఉండే ఈ రహదిరిపై కల్వర్ట్‌ను వెడల్పు చేయడం, రక్షణగోడ నిర్మించడంపై సంబంధిత శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని, వాహనదారులు, ఇరు గ్రామాల ప్రజలు, రైతులు, పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-19T05:37:41+05:30 IST