‘ఆధార్‌’ తిప్పలు..!

ABN , First Publish Date - 2021-10-14T06:28:21+05:30 IST

ఆధార్‌ సేవలు పొందాలంటే ఆషామాషీ కాదు. టోకన సంపాదించడం ఒక ఎత్తు అయితే.. ఆధార్‌ సేవలు పొందేందుకు సమర్పి ంచాల్సిన ధ్రువపత్రాలు తేవడం అంతకుమించిన కష్టం.

‘ఆధార్‌’ తిప్పలు..!
చిన్నారులకు బయోమెట్రిక్‌ వేస్తున్న దృశ్యం

ఏ మార్పు చేయాలన్నా..  ధ్రువపత్రాలన్నీ కావాల్సిందే

అడ్రస్‌ మార్చాలంటే గెజిటెడ్‌ అధికారి సంతకం తప్పనిసరి

చిన్నపిల్లల కొత్త ఆధార్‌ కార్డుకు ఎన్నెన్నో ఆధారాలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, అక్టోబరు 13: ఆధార్‌ సేవలు పొందాలంటే ఆషామాషీ కాదు. టోకన సంపాదించడం ఒక ఎత్తు అయితే.. ఆధార్‌ సేవలు పొందేందుకు సమర్పి ంచాల్సిన ధ్రువపత్రాలు తేవడం అంతకుమించిన కష్టం. ఏ చిన్న మార్పు చేయాలన్నా.. అన్ని ధ్రువపత్రాలూ ఉండాల్సిందే. గెజిటెడ్‌ అధికారుల సంతకాలు కూడా కావాలి. అష్టకష్టాలు పడి టోకెన సంపాదించిన వారికి ఆధార్‌ సెంటర్‌ నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. కొత్త ఆధార్‌ కార్డు తీసుకోవాలన్నా... పేరు, అడ్రస్‌, పుట్టిన తేదీ మార్పు చేయాలంటే గెజిటెడ్‌ హోదా అధికారి సం తకం తప్పనిసరి చేయడంతో కార్డుదారులకు తిప్పలు తప్పడం లేదు. గెజిటెడ్‌ హోదా అధికారి సంతకం కోసం కార్డుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అష్టకష్టాలు పడి, సంతకం చేయించుకుని వచ్చినా.. ఆధార్‌ సెంటర్‌ నిర్వాహకులు చేస్తారా అంటే... అదీ లేదు. కార్డుదారుడికి సంబంధించిన గుర్తింపు కార్డులు కావాలని చెబుతున్నారు. దీంతో సదరు కార్డుదారులు అయోమయంలో పడుతున్నారు. అన్ని కష్టాలు పడి.. మార్పుచేర్పులు చేయించుకున్నా.. అవి సరిగా వస్తాయో.. లేదో.. కూ డా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలా ఆధార్‌ సేవలు పొందేందుకు కార్డుదారు అవస్థలు అన్నీఇన్నీ కావు.


వ్యక్తిగత ధ్రువపత్రాలు ఉండాల్సిందే...

ఇదివరకు ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్పు చేయాలంటే మీ-సేవ సెంటర్ల వద్ద కుటుంబసభ్యుడి పేరు మీద ఉన్న కరెంటు బిల్లు తీసుకెళ్తే చాలు. ప్రస్తుతం ఆ వ్యక్తి గు ర్తింపు కార్డులు ఆధారాలుగా చూపితేనే మార్పులు, చే ర్పులు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు కార్డుదారులకు తలనొప్పిగా మారింది. ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్దామంటే ఒక్కో కార్డు ఒక్కో విధంగా ఉండటం... అడ్ర్‌సలు ఒకలా ఉండటం.. మరికొందరికి గుర్తింపు కార్డులు లేకపోవడం స మస్యగా మారుతోంది. అన్నీ ఉన్నా... గెజిటెడ్‌ అధికారి సంతకం చేయించుకు వస్తేనే మార్పులు చేస్తామని చెబుతున్నారు. ఇదే విషయంపై పలువురు ఆధార్‌ సెంటర్ల నిర్వాహకులను అడిగితే నిబంధనల మేరకు చెబుతున్నామనీ, సొంతంగా తామేమీ చెప్పడం లేదని బుకాయిస్తుండటం గమనార్హం.


చిన్నపిల్లల కొత్త ఆధార్‌కార్డుకు ఎన్నెన్నో ఆధారాలు

చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా ఆధార్‌ కార్డు చేయించేందుకు వచ్చే తల్లిదండ్రుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నిబంధనల (తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, రేషనకార్డు) మేరకు చిన్నపిల్లలకు ఆధార్‌ కార్డు చేయాలని ఉన్నాయి. కొందరు ఆధార్‌ సెంటర్‌ నిర్వాహకులు మాత్రం తల్లిదండ్రులకు చుక్కలు చూపెడుతున్నారు. త ల్లిదండ్రుల రేషనకార్డులు, ఆధార్‌ కార్డులతోపాటు ఓటరు కార్డు, పానకార్డు, ఇంటి అడ్రస్‌ ప్రూఫ్‌ ఇలా రకరకాల ఆ ధారాలు అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కార ణం.. న్యూ ఎనరోల్‌మెంట్‌ (చిన్నపిల్లల కొత్త నమోదు)కు సంబంధించి ఉచితంగా చేయాల్సి వస్తుండటమే. దీనివల్ల ఆయా సెంటర్ల నిర్వాహకులకు ఎలాంటి లాభం లేకపోవడంతోనే ఇలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కొందరు సెంటర్ల నిర్వాహకులు చిన్నారులకు ఫింగర్‌ప్రింట్‌ సరిగా పడకపోవడం, ఐరిస్‌ తదితర సమస్యలను బూచిగా చూ పడం... రకరకాల ఆధారాలు కావాలని చెప్పి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ తెచ్చుకోలేని కొందరు తల్లిదండ్రులు ఒక్కో కార్డుకు రూ.200 నుంచి రూ.300 ఇచ్చి మరీ చేయించుకుంటున్నారు.


పెళ్లయిన ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణం

ఆధార్‌ అడ్రస్‌ మార్పుల విషయంలో కొత్తగా పెళ్లయిన ఆడపిల్లల అవస్థలు అన్నీఇన్నీకావు. అత్తారింటికి అడ్రస్‌ మార్చుకునేందుకు ఆధార్‌ కేంద్రం వద్దకు వెళ్తే ఒక్కో సెంటర్‌ నిర్వాహకుడు ఒక్కోలా చెబుతుండటంతో బాధిత నూతన వధువులు ఆవేదన చెందుతున్నారు. మార్పు చేయాల్సిన అడ్ర్‌సలో రేషనకార్డు, ఓటరు కార్డు, పానకార్డులుండాలని అడుగుతున్నారు. గుర్తింపు కార్డులతోపాటు కొత్త అడ్ర్‌సను ఆధార్‌ మార్పులుచేర్పులకు సంబంధించిన ఫారమ్‌లో నింపుకొని గెజిటెడ్‌ అధికారు (తహసీల్దార్‌ తదితరు)లతో సంతకాలు చేయించుకు రావాలంటున్నారు. కొత్తగా అత్తారింటికి వెళ్లే మహిళలకు అక్కడ అడ్ర్‌సకు సంబంధించిన ప్రూఫ్‌లు ఎలా ఉంటాయి..? ఒకవేళ ఆ ఇంటి అడ్రస్‌ మీద కుటుంబసభ్యుల గుర్తింపు కార్డులున్నా... అందులో అడ్రస్‌ తప్పులుంటే వారివి సరిపోవని చెబుతుండటంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఇలా ఎవరికి ఎలాంటి మార్పులు, చేర్పు లు చేయాలన్నా గుర్తింపు కార్డులు, గెజిటెడ్‌ అధికారుల సంతకాలను తప్పనిసరిగా అడుగుతుండటంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకు ము నుపు మాదిరి ఇంట్లో కుటుంబసభ్యుల్లో ఎవరిదో ఒకరి పేరుమీద ఉన్న కరెంటు బిల్లుకు అనుగుణంగానే ఆధార్‌ సేవలు అందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


రకరకాల ఆధారాలు అడుగుతున్నారు..: హసీనా, అనంతపురం

నా కుమారుడికి 3 ఏళ్లు... ఆధార్‌ కార్డు చేయిద్దామని వెళ్తే... మొదట నాది, నా భర్తది ఆధార్‌ కార్డులు, రేషనకార్డులు కావాలన్నారు. మా పిల్లోడి బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలన్నారు. అవన్నీ తీసుకెళ్లా. బర్త్‌ సర్టిఫికెట్‌లో ఏదో ఒక నెంబరు కనిపించడం లేదని చెప్పారు. ఏం చేయాలని అడిగితే రేషనకార్డు, పానకార్డు, లేదంటే బ్యాంకు పాసుబుక్కు, ఓటరు కార్డు ఇలా చాలానే చెప్పారు. అవన్నీ తీసుకెళ్తే... ఒక్కోదాంట్లో ఒక్కో అడ్రస్‌ ఉందనీ, కరెక్ట్‌ అడ్రస్‌ ఉండే ప్రూఫ్‌ తీసుకు రమ్మంటున్నారు. నెల రోజులుగా తిరుగుతున్నాం.


అత్తారింట్లో ఉంటున్నట్లు గుర్తింపు కార్డు తీసుకురావాలంటున్నారు

 - జయలక్ష్మి, అనంతపురం

నా కుమార్తెకు ఆరు నెలల క్రితం వివాహమైం ది. మా అల్లుడుది బెంగళూరు. అక్కడికి ఆధార్‌ మార్పు చేయాలని ఆధార్‌ కేంద్రానికి వెళ్తే.. వారు అత్తారింటి నుంచి ఏదైనా గుర్తింపు కార్డు, అడ్రస్‌ ప్రూఫ్‌, గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించుకు రావాలని చెబుతున్నారు. అందరి పేర్ల మీద కలిపి ఒక్క కార్డు కూడా లేదు. ఒకరి పేరు మీద గ్యాస్‌, మరొకరి పేరు మీద కరెంటు బిల్లులున్నాయి. ఇంతకుముందు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి కరెంటు బిల్లు, గ్యాస్‌ బిల్లు ఇస్తే చేసేవారు. ఇప్పుడేమో ఏవేవో ప్రూఫ్‌లు కావాలంటున్నారు. ఏంచేయాలో అర్థం కావడం లేదు.


నాకు సంబంధించిన గుర్తింపు కార్డులే కావాలంటున్నారు

వలీబాషా, అనంతపురం

అడ్రస్‌ మార్చుకునేందుకు ఆధార్‌ కేంద్రం వద్దకు వెళ్తే... నాకు సంబంధించి మార్పు చేసుకునే అడ్ర్‌సలో రేషనకార్డు, ఓటరు కా ర్డు, పానకార్డు ఉండాలని అడుగుతున్నారు. ఇంతకుముందు ఇంట్లో వాళ్లది ఎవరి దో ఒకరిది కరెంటు బిలు ఇస్తే అడ్రస్‌ మార్చేవారు. ఇప్పుడు నాకు సం బఽంధించిన గుర్తింపు కార్డులతోపాటు కొత్త అడ్ర్‌సను ఫారమ్‌లో నింపుకొని గెజిటెడ్‌ అధికారి సంతకాలు చేయించుకు రావాలంటున్నారు. చేసేదేమీలేక త హసీ ల్దార్‌ సంతకం చేయించుకుని, ఆధార్‌ కార్డు చేసుకుంటున్నా. ముం దు మాదిరిగా ఇంట్లోని ఎవరిదో ఒకరి ప్రూఫ్‌ మీద ఆధార్‌ సేవలు అందిస్తే బాగుంటుంది.

Updated Date - 2021-10-14T06:28:21+05:30 IST