ఆధార్‌ తిప్పలు

ABN , First Publish Date - 2021-08-04T07:03:08+05:30 IST

విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఆధార్‌ తప్పనిసరి చేయటంతో తప్పులు, అడ్రస్‌ మార్పుల విషయంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే ఏ ఆధార్‌ కేంద్రానికి వెళ్లినా, మీసేవ సెంటర్‌కెళ్లినా, బ్యాంకు కెళ్లినా సర్వర్‌ సమస్య ఉందనే సమాధానమే వినిపిస్తోంది.

ఆధార్‌ తిప్పలు

ఆధార్‌ తప్పనిసరి చేసిన విద్యాసంస్థలు

పేరు, అడ్రస్‌, పుట్టిన తేదీల సవరణల 

కోసం విద్యార్థుల అవస్థలు

సచివాలయాల్లో పనులు చేయలేక 

తిప్పిపంపుతున్న వైనం

జిల్లా కేంద్రానికి పరుగులు 

తీస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఆగస్టు3: విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఆధార్‌ తప్పనిసరి చేయటంతో తప్పులు, అడ్రస్‌ మార్పుల విషయంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే ఏ ఆధార్‌ కేంద్రానికి వెళ్లినా, మీసేవ సెంటర్‌కెళ్లినా, బ్యాంకు కెళ్లినా సర్వర్‌ సమస్య ఉందనే సమాధానమే వినిపిస్తోంది. ఫింగర్‌ ప్రింట్‌ మిషన పనిచేయడం లేదని చెబుతుండ టంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజుల తరబడి వేచి ఉన్నా పనులు జరగకపోవ డంతో జిల్లా కేంద్రానికి వచ్చి బ్యాంకులు, మీసేవా, పోస్టాఫీసుల్లో సేవలు వినియోగించుకుంటున్నారు. ఇలా విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల కు ఆధార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


40 సచివాలయాలు.. రూ. 45 లక్షల పరికరాలు..

ఆధార్‌ సేవలు పొందాలంటే రోజుల తరబడి నిరీక్షిం చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా మొదటివిడతగా చిల మ త్తూరు, కూడేరు, లేపాక్షి, బత్తలపల్లి, ముదిగుబ్బ, పెద్దవడుగూరు, యాడికి, బొమ్మనహాళ్‌, శింగనమల, సీకేపల్లి, డీ.హీరేహాళ్‌, ఎన్పీకుంట, నల్లచెరువు, ఓడీ చెరువు, పుట్లూరు, రాప్తాడు, శెట్టూరు, తాడిమర్రి, విడప నకల్లు, యల్లనూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, గార్లదిన్నె, కుందుర్పి, ఆత్మకూరు, రొద్దం, బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, గుడిబండ, వజ్రకరూరు, పరిగి, నార్పల, మడకశిర, రొళ్ల, కొత్తచెరువు, గుమ్మఘట్ట, రామగిరి, తలుపుల, కంబదూరు, సోమందేపల్లి మండలాల్లోని 40 సచివాలయాలకు ఆధార్‌ కేంద్రాలను మంజూరుచేసింది. ఆయా కేంద్రాల్లో ఆధార్‌ సామగ్రి కోసం రూ. 45 లక్షల విలువైన యంత్రాలను జి ల్లాకు సరఫరా చేశారు. ఆయా మండలాల్లోని సచివాల యాల్లో ఆధార్‌ యంత్రాల కొరకు ఒక్కో మండలానికి రూ. 1.14 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌, మానిటర్‌, మల్టీఫంక్షన డివైజ్‌(ఎంఎ్‌ఫడీ), ఐరిష్‌ డివైజ్‌, కెమెరా, వైట్‌ స్ర్కీన, ఫింగర్‌ ఫ్రింటర్‌, ఫోకస్‌ లైట్‌, జీపీఎస్‌ డివై్‌సలను అందిం చింది. వీటి కోసం రూ. 45 లక్షలు ఖర్చు చేశారు. ఇలా సచివాలయాల్లో రూ. 45 లక్షలతో ఆఽధార్‌ సెంటర్లు ఏర్పాటు చేసినా సేవలందడం లేదనే విమర్శలు స్థానిక ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. 


ప్రభుత్వ సంక్షేమ పథకాలతోనే తలమునకలు

జిల్లాలోని పలు మండలాల్లోని సచివాలయాల్లో ఏర్పా టు చేసిన ఆధార్‌ కేంద్రాల్లో ప్రజలకు సక్రమంగా సేవలం దటం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పనుల్లో   సిబ్బం ది తలమునకలవడమే కారణం. ఉదయం నుంచి సా యంత్రం వరకూ వేచి ఉన్నా... కొన్ని సచివాలయాల్లో ఏదో ఒక సాకుతో తిప్పిపంపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొబైల్‌ నెంబరు లింకప్‌ చేయాలంటే... వలంటీర్ల మొబైల్‌కు స్మాల్‌ ఫింగర్‌ప్రింటర్‌ అటాచ చేసి ఫింగర్‌ప్రింట్‌ వేస్తున్నారు. అయితే అది రెండు నెలల వరకు మాత్రమే అప్‌డేషనలో చూపెడుతోంది. తర్వాత మళ్లీ అప్‌డేషన చూపిస్తుండటంతో సమీప సచివాలయా ల ఉద్యోగులను అడగడం... వారు అనంతపురానికి వెళ్లి చే యించుకోవాలని ఉచిత సలహా ఇస్తుండటంతో స్థానిక ప్ర జలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇక పుట్టిన తేదీల్లో మార్పులు చేయాలన్నా, అడ్రస్‌ మార్పులు, పేరు లోని ఒకటి రెండు లేదా రెండు అక్షరాలను మార్చాలన్నా ఇక్కడ సామగ్రి లేదని, మరికొన్నిచోట్ల పనిచేయడం లేదని చెబుతుండటంతో ప్రజలు జిల్లాకేంద్రానికి రాక తప్పటం లేదు. మొదటిసారి ఆధార్‌ కార్డు కోసం వచ్చే తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా ఉంది. చిన్నపిల్లలు కావడంతో వారి ఐరి్‌షను కంప్యూటర్‌ తీసుకోవటం లేదు. ఈ పరిస్థితుల్లో చిన్నారి తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు, వారి వేలిముద్రలతో ఆ చిన్నారికి కొత్తకార్డును నమోదు చేస్తారు. ఇక్కడ ఫింగర్‌ప్రింటర్‌ పనిచేయడం లేదని కొన్ని సచివాలయాల్లో చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.


సర్వర్‌తో సమస్య 

జిల్లాలోని పలు బ్యాంకుల్లో సర్వర్‌ సమస్యతో ఆధార్‌ సేవలు అందివ్వటం లేదు. బ్యాంకులో రద్దీగా ఉండటం, కరోనా కారణంగా కొన్నిసార్లు తూతూమంత్రంగా  అప్‌డే ట్‌, అడ్రస్‌, మొబైల్‌ నెంబర్‌ లింక్‌లను చేస్తుండటంతో అవి రిజెక్ట్‌ అవుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో అయితే సర్వర్‌ సమస్యను చూపి రోజుల తరబడి ఆధార్‌ కేంద్రాలను మూసి వేస్తున్న సం ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రజలు ఎక్కడ సేవలు సక్రమంగా అందుతున్నాయంటే అక్కడికి వందల రూపాయలు చార్జీ పెట్టుకుని మరీ వెళ్తున్నారు. 


మా ఊళ్లోని మీ-సేవ, బ్యాంకుల్లో పేరు, అడ్రస్‌ మార్పు చేయరంట 

నేను పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరాలనుకుంటున్నా.  ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నా స ర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులోని పేరు లో రెం డు అక్షరాలు తప్పుగా ఉన్నాయి. సరిచేసుకొని రావాలన్నారు. మా అమ్మ, నేను కదిరిలోని బ్యాంకు వద్దకు వెళ్లాము. అక్కడ వారు అడ్రస్‌, పేరు మార్పు చేయలేము.. అనంతపురానికి వెళ్లాలని చెప్పారు. మాకు తెలిసిన వాళ్ల మీ-సేవ సెంటర్‌కు వెళ్లాను. సర్వర్‌ పనిచేయడం లేదని చెప్పారు. అందుకే మా ఊరి నుంచి పోస్టాఫీసుకు వచ్చా. 

నరసింహ పార్థసారథి, కదిరి


పుట్టిన తేదీ తప్పులు సరిచేయాలంటే అనంతపు రం వెళ్లమన్నారు 

మా ఊళ్లో నేను 6వ తరగతిలో చేరేందుకు వెళ్తే... స్కూల్లో సారోళ్లు నీ ఆధార్‌ కార్డులో డేట్‌ఆఫ్‌ బర్త్‌ తప్పుగా ఉంది సరిచేసుకొని రావాలన్నారు. మా ఊళ్లోని సచివాల యానికి వెళ్లి అడిగితే ఇక్కడ డేటాఆఫ్‌ బర్త్‌ చేయము. ఇవన్నీ అనంతపురంలోనే చేస్తారని అక్కడికెళ్లి చేయించు కోవాలని చెప్పారు. అందుకే నేను మా తాతను వెంట బెట్టుకొని ఇక్కడకు వచ్చా. 

లక్ష్మి, 6వ తరగతి విద్యార్థిని, రాప్తాడు


Updated Date - 2021-08-04T07:03:08+05:30 IST