Abn logo
Jul 7 2020 @ 22:43PM

ఆ వార్తల్లో నిజం లేదంటున్న ఆది పినిశెట్టి

అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న ‘పుష్ప’ చిత్రంపై రూమర్స్ అస్సలు ఆగడం లేదు. రోజుకో రూమర్ ఈ సినిమాపై ప్రత్యక్షమవుతుంది. ఈ సినిమాకి పేరు పెట్టి, ఫస్ట్ లుక్ వదలబట్టి సరిపోయింది కానీ.. లేదంటే రోజుకో టైటిల్ చొప్పున ఇప్పటికి బోలెడన్ని టైటిల్స్ దర్శనమిచ్చేవి. ఇక ఈ సినిమా కోసం సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని ముందు అనుకున్నట్లుగానూ, ఆమె రిజిక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తర్వాత అవి రూమర్స్ అని తెలిసింది. రీసెంట్‌గా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఐటం నెంబర్ చేస్తుందని వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఏ రకంగా ఖండించిందో తెలిసిందే. ఇప్పుడు ‘పుష్పరాజ్’ బ్రదర్‌గా ‘రంగస్థలం’లో రామ్ చరణ్ బ్రదర్‌గా చేసిన ఆది పినిశెట్టి చేస్తున్నాడని, ఇందులో కూడా అతనిది సర్పంచ్ రోలే అనే వార్తలు పుట్టుకొచ్చాయి.


అయితే ఈ వార్తల్లో కూడా నిజం లేదని స్వయంగా ఆది పినిశెట్టి తెలిపినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ఈ సినిమాలో పాత్ర కోసం నన్నెవరు సంప్రదించలేదని, వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని ఆది పినిశెట్టి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఎవరు పుట్టించారో నాకు తెలియదు కానీ, ప్రస్తుతానికైతే అందులో నటించమని ఆఫర్ మాత్రం తనకు రాలేదని ఆది పినిశెట్టి క్లారిటీగా చెప్పాడని అంటున్నారు. అయితే ఆది పినిశెట్టి ఇది వరకే అల్లు అర్జున్ చిత్రంలో విలన్‌గా చేశాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’లో ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. బన్నీ, ఆదిల కెమిస్ట్రీ ఆ సినిమాకి ప్లస్ అయిన విషయం తెలిసిందే. మరోసారి ఈ కాంబినేషన్ అనగానే అంతా ఏదేదో ఊహించేసుకున్నారు. కానీ అదేం లేదని ఆది పినిశెట్టి తేల్చేశాడు. 

Advertisement
Advertisement
Advertisement