Jun 18 2021 @ 22:48PM

ఆది హీరో... సునీల్‌ కీ-రోల్‌!

ఆది సాయికుమార్‌ హీరోగా ‘నాటకం’ ఫేమ్‌ కల్యాణ్‌ జీ గోగణ దర్శకత్వంలో నాగం తిరుపతిరెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సునీల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఆది సాయికుమార్‌ను కొత్త కోణంలో చూపించే చిత్రమిది. సునీల్‌గారి పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అడగ్గానే ఒప్పుకొన్నందుకు ఆయనకు థ్యాంక్స్‌. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి, సంగీతం: మణికాంత్‌.