Apr 19 2021 @ 18:36PM

ఆదితో రెండోసారి కుదిరింది!

'చుట్టాలబ్బాయి' కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ఆది సాయికుమార్ హీరోగా వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఈ సినిమా రూపొందనుంది. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు. ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ ''ఆది సాయికుమార్ హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `చుట్టాల‌బ్బాయి` మంచి హిట్ అయింది. మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో అధ్భుత‌మైన విజ‌యాన్ని సాధించే సినిమా చేయాల‌ని ప్లాన్ చేశాం. చక్కని కథ కుదిరింది. మా ఇద్దరి కలయికలో మరో విజయం తప్పనిసరి. నాగం తిరుప‌తి రెడ్డి, పి.మన్మథరావు అభిరుచి ఉన్న నిర్మాత‌లు. ఒక సూప‌ర్‌హిట్ సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది'' అని తెలిపారు.