ఆలూ గోబి (రెస్టారెంట్‌ స్టెయిల్‌)

ABN , First Publish Date - 2021-04-29T19:44:35+05:30 IST

గోబి- 1, ఆలుగడ్డ- రెండు, ఉల్లిగడ్డ- 1, టమోటాలు- రెండు, జీడిపప్పు- 15, అల్లం వెల్లుల్లి పేస్టు- స్పూను, కారం పొడి- స్పూను, పసుపు- అర స్పూను, గరం మసాలా పొడి- స్పూను, నూనె, ఉప్పు, నీళ్లు- తగినంత, యాలకులు, లవంగాలు, దాల్చిన

ఆలూ గోబి (రెస్టారెంట్‌ స్టెయిల్‌)

కావలసిన పదార్థాలు: గోబి- 1, ఆలుగడ్డ- రెండు, ఉల్లిగడ్డ- 1, టమోటాలు- రెండు, జీడిపప్పు- 15, అల్లం వెల్లుల్లి పేస్టు- స్పూను, కారం పొడి- స్పూను, పసుపు- అర స్పూను, గరం మసాలా పొడి- స్పూను, నూనె, ఉప్పు, నీళ్లు- తగినంత, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క- చెరో రెండు.


తయారుచేసే విధానం: ముందుగా జీడిపప్పును అర గంటసేపు నానబెట్టి ముద్ద చేసుకోవాలి. టమోటా, ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్‌ చేయాలి. గోబీ పూలను కత్తిరించి నీళ్లలో ఉప్పు వేసి ఇరవై నిమిషాలు ఉడికించి నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి మసాలా దినుసులన్నీ వేసి వేగాక ఉల్లి ముక్కల్ని దోరగా వేయించాలి. దీనికి అల్లం వెల్లుల్ని పేస్టుని కలపాలి. టమోటా ముక్కల్ని కూడా జతచేసి ఓ అయిదు నిమిషాలు మగ్గించాలి. దీనికి జీడిపప్పు పేస్టు, పసుపు, కారప్పొడి వేసి కలుపుతూ ఉండాలి. కాస్త వేగాక గోబీ, ఆలు ముక్కలు, ఉప్పు, తగినంత నీరు పోసి మూతపెట్టి ఓ అయిదు నిమిషాలు ఉడికించాలి. ఆఖరున గరం మసాలా పొడి వేసి కూరంతా కలియబెట్టాలి. రెండు నిమిషాల్లో ఆలూ గోబి రెడీ. కూర మరీ గట్టిగా అయినట్టు అనిపిస్తే కాస్త నీళ్లు పోసి కలిపితే సరి.

Updated Date - 2021-04-29T19:44:35+05:30 IST