సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జూనియర్ కేజ్రీవాల్..!

ABN , First Publish Date - 2020-02-11T18:33:27+05:30 IST

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్... దేశ రాజకీయాల్లో ఈ పేరుకున్న ప్రత్యేకతే వేరు... సమయానికి తగినట్టు ఆయన మాట్లాడే మాటలతో...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జూనియర్ కేజ్రీవాల్..!

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్... దేశ రాజకీయాల్లో ఈ పేరుకున్న ప్రత్యేకతే వేరు... సమయానికి తగినట్టు ఆయన మాట్లాడే మాటలతో ఎంతటి వాళ్లైనా ఫిదా అయిపోవాల్సిందే.. దీంతో పాటు ఢిల్లీలో చలిని తట్టుకునేందుకు ఆయన ధరించే మఫ్లర్‌కి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనిపై ఇప్పటికే సరదాగా రకరకాల జోకులు, కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఓ బుడతడు ఏకంగా కేేజ్రీవాల్ మఫ్లర్‌తో వేషం వేసుకుని మరీ దర్శనమిచ్చాడు. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలవుతుండగానే ఆమాద్మీ పార్టీ అతడి ఫోటోను ట్విటర్లో షేర్ చేసుకుంది. ‘‘మఫ్లర్ మ్యాన్’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. 


కేజ్రీవాల్‌కి ‘‘మఫ్లర్ మ్యాన్’’ అన్న పేరు సోషల్ మీడియాలో ప్రాచుర్యం కావడంతో...  పోస్టు చేసిన కొద్ది గంటలకే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. అచ్చం కేజ్రీవాల్ వేషంలో చూడముచ్చటగా ఉన్న సదరు బుడతడిని చూసి మురిసిపోతున్నారు. ఇప్పటికే 8 వేలమందికి పైగా లైక్ చేశారు. 1200 మంది రీట్వీట్ చేశారు. ‘‘సో క్యూట్..’’ అని కొందరు.. ‘‘జూనియర్ కేజ్రీవాల్’’.. ‘‘ఇతడు ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు’’ అని కొందరు స్పందిస్తున్నారు. మరికొందరైతే ఈయనే కేజ్రీవాల్ అన్నట్టు ‘‘అభినందనలు సార్’’ అని శుభాకాంక్షలు చెబుతున్నారు.  కాగా గతంలో కూడా కేజ్రీవాల్ మఫ్లర్ పలుమార్లు వార్తల్లోకి ఎక్కింది. ఆయనకు ఎంతో ఇష్టమైన మఫ్లర్  ఎందుకు ధరించడంలేదంటూ ఇటీవల నెటిజన్లు ప్రశ్నించారు కూడా. కాగా గత ఎన్నికల్లో ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసిన ఆప్.. ఈసారి కూడా భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది.  

Updated Date - 2020-02-11T18:33:27+05:30 IST