పంజాబ్ ఎన్నికలు: ఆప్ తొలి జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-11-12T23:40:22+05:30 IST

పంజాబ్ ఎన్నికలు: ఆప్ తొలి జాబితా విడుదల

పంజాబ్ ఎన్నికలు: ఆప్ తొలి జాబితా విడుదల

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. 10 మంది సిట్టింగ్ స్థానాలతో కూడిన జాబితాను అన్ని పార్టీల కంటే ముందే ఆప్ ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్, అకాలీదళ్ తర్వాత ఆప్ ప్రధాన పార్టీగా పంజాబ్‌లో ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడడంతో ప్రస్తుతం 10 స్థానాలతో మూడో స్థానంలో ఉంది.


పంజాబ్ ఎన్నికల బరిలో త్రిముఖ పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 8 లోక్‌సభ స్థానాలకు గాను ఆప్ నాలుగు స్థానాలు గెలుచుకుంది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు గెలుచుకుంది. పంజాబ్ స్థానిక పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ కంటే రెండు స్థానలు ఎక్కువగా గెలిచి ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉంది. అయితే తర్వాత జరిగిన పరిణామాల వల్ల 10 మంది ఎమ్మెల్యేల్ని కోల్పోయింది.


ఆప్‌కు ఢిల్లీ తర్వాత అంతటి ఆదరణ లభించింది పంజాబ్‌లోనే. దేశ వ్యాప్తంగా ఆప్‌కు పేరు ఉన్నప్పటికీ పంజాబ్‌లో మాత్రమే చట్ట సభల ప్రాతినిధ్యం లభించింది. అయితే దీనిని ఆప్ కోల్పోవాలని భావించడం లేదు. ఎలాగైనా పంజాబ్‌లో తమ పట్టు నిలుపుకుని అధికారం కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగానైనా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతోంది.

Updated Date - 2021-11-12T23:40:22+05:30 IST