Abn logo
Oct 14 2021 @ 23:47PM

ఖైదీ నెంబర్ 956గా ఆర్యన్ ఖాన్‌.. ఇంటి నుంచి రూ.4,500 మనియార్డర్

ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో అతడిని అధికారులు జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. దానికి ముందు ఆర్యన్‌కు కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష ఫలితం వచ్చేవరకు క్వారంటైన్ గదిలో ఉంచారు. ఆ పరీక్షలో ఆర్యన్‌కు నెగెటివ్ తేలడంతో తాజాగా కామన్ సెల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అతడికి అండర్ ట్రైల్ ఖైదీగా 956 నెంబరును కేటాయించారు. సెల్‌లో మరో నలుగురు సాధారణ ఖైదీలతో ఆర్యన్ ఉండాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే కోటీశ్వరుడైన ఆర్యన్‌కు ఇంటి నుంచి మనియార్డర్ వచ్చింది. అందులో రూ.4,500 ఉన్నట్లు అధికారులు తెలిపారు. జైలు క్యాంటీన్‌లో ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకునేందుకు ఆర్యన్‌కు ఈ నగదు ఉపయోగపడనుంది.