Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆవడలు

కావలసిన పదార్థాలు: మినపప్పు- అరకిలో, పెరుగు- లీటరు, అల్లం: చిన్న ముక్క, పచ్చి మిర్చి- నాలుగు, ఆవాలు, జీలకర్ర- రెండు చెంచాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు- తగినంత


తయారుచేసే విధానం: మినపప్పు నాలుగు గంటలు నానబెట్టి పొట్టు తీసి మెత్తగా కడిగి రుబ్బు కోవాలి. పెరుగులో కాస్త నీటిని కలిపి పల్చగా చేసుకోవాలి. అల్లం, మిర్చిని ముద్దగా చేసుకుని మినపప్పు రుబ్బులో కలపాలి. కొత్తిమీర, కరివేపాకును సన్నగా తరిగి వేయాలి. కడాయిలో నూనె మరిగించి గారెల్లా వేయించుకోవాలి. ఓ గిన్నెలోని నీటిలో కాలిన ఒక్కో గారెను ముంచి ఆ తరవాత పెరుగులో వేయాలి. తర్వాత ఈ పెరుగులో జీలకర్ర, ఆవాలుతో తాళింపు పెడితే ఆవడ సిద్ధం. వీటిని పావుగంట తరవాత ఆరగిస్తే రుచిగా ఉంటాయి.

పెసరపప్పు బూరెలురిబ్బన్‌ పకోడీగుమ్మడి చపాతిరైస్‌ పొటాటో కట్‌లెట్స్‌పెసరపప్పు పాలకూరతో...కారం బూందీమినపప్పు మురుకులుకోడ్‌బళెపిన్నిఫ్రైడ్‌ ఆనియన్‌ రింగ్స్‌
Advertisement