మహారాస్నాదికాడ

ABN , First Publish Date - 2021-02-09T18:11:20+05:30 IST

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాతరోగ చికిత్సకు ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో మహారాస్నాదికాడ ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంథమైన శార్గ్జధరసంహితలోని మధ్యమకాండలో వివరించడం జరిగింది. ఈ ఔషధం బ్రహ్మచే ఉపదేశించబడినదిగా శాస్త్రగ్రంధాల్లో చెప్పబడింది.

మహారాస్నాదికాడ

ఆంధ్రజ్యోతి(09-02-2021)

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాతరోగ చికిత్సకు ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో మహారాస్నాదికాడ ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంథమైన శార్గ్జధరసంహితలోని మధ్యమకాండలో వివరించడం జరిగింది. ఈ ఔషధం బ్రహ్మచే ఉపదేశించబడినదిగా శాస్త్రగ్రంధాల్లో చెప్పబడింది.


మహారాస్నాదికాడ ఔషధంలో ముఖ్యమూలిక దుంపరాష్ట్రము. దీనిని సంస్కృతంలో మహబలిరాస్న అని పలు పేర్లు కలవు. ఇది పసుపు ముక్కలాగా ఉంటుంది. దీని దుంప సువాసన కలిగి ఉంటుంది. ఔషధాలలో దుంపనే ఎక్కువగా వాడతారు. మహారాస్నాదికాడను దుంపరాష్ట్రంతో పాటు దురదగొండి, ఆముదపు వేళ్లు, దేవదారు బెరడు, వస, అడ్డసరంపు ఆకు, తుంగ, తెల్లగలిజేరు, తిప్పతీగ, పల్లేరు, రేలకాయ గుజ్జు, పిప్పళ్లు, చిన్నములక మొదలైన 30 రకాల మూలికలతో కలిపి కషాయంగా కాచి తయారుచేస్తారు. 


మహారాస్నాదికాడ పలురకాల వాత రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. సర్వాంగ కంప వాతం, గూని వాతం, పక్షఘాత వాతం నడుము మొదలు కాళ్ల వరకూ వాతం కలుగజేసే గృద్రసీవాతం మొదలైన పది రకాల వాతములకు విశేషంగా పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో ఎక్కువమంది అనుభవిస్తున్న మోకాళ్లనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మహారాస్నాదికాడ గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. గర్భధారణ సమస్యను సరిచేయడానికి అనుపానంగా దీన్ని వాడడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. 


ఉపయోగించే మోతాదు: పెద్దలు 10 మి.లీటర్లు, పిల్లలు 5 మి.లీటర్లు చొప్పున ఉదయం, సాయంత్రం వైద్యుల సూచన మేరకు తీసుకోవలెను. ప్రస్తుతం ధూద్‌ పాపేశ్వర్‌, జైద్యనాధ్‌, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు మహారాసాద్నికాడను తయారుచేస్తున్నాయి.


శశిధర్‌

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌,

కొత్తపేట, చీరాల.

Read more