`బీ`, `ఏబీ` బ్లడ్ గ్రూప్ వారికే కరోనా ముప్పు ఎక్కువ: సీఎస్‌ఐఆర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-12T00:30:22+05:30 IST

ఇతర బ్లడ్ గ్రూప్‌లతో పోల్చుకుంటే `బీ`, `ఏబీ` బ్లడ్ గ్రూప్ వ్యక్తులే కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) తాజా సర్వేలో తేలింది.

`బీ`, `ఏబీ` బ్లడ్ గ్రూప్ వారికే కరోనా ముప్పు ఎక్కువ: సీఎస్‌ఐఆర్‌ సర్వే

ఇతర బ్లడ్ గ్రూప్‌లతో పోల్చుకుంటే `బీ`, `ఏబీ` బ్లడ్ గ్రూప్ వ్యక్తులే కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) తాజా సర్వేలో తేలింది. `ఓ` బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులపై కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. `ఓ` బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, వారికి వైరస్ సోకినా పెద్దగా ప్రభావం చూపడం లేదని బయటపెట్టింది. 


దేశవ్యాప్తంగా 10వేల మందితో నిర్వహించిన ఈ సర్వేలో 140 మంది వైద్యులు కూడా పాల్గొన్నారు. ఇక, శాకాహారుల కంటే మాంసాహారులకే కరోనా సంక్రమించే అవకాశం ఎక్కువ ఉందని ఈ పరిశోధన తేల్చింది. శాకాహారం వల్ల ఫైబర్ కంటెంట్ శరీరంలోకి చేరుతుందని, అది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాబట్టి, వైరస్ విస్తృతిని అడ్డుకుంటోందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ​అలాగే ఇన్ఫెక్షన్ అనంతర సమస్యలను కూడా నివారిస్తోందని పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-12T00:30:22+05:30 IST