ఒక్కరన్‌కే డివిలియర్స్ అవుట్.. కష్టాల్లో ఆర్సీబీ

ABN , First Publish Date - 2021-04-15T02:10:43+05:30 IST

సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూలు కష్టాల్లో కూరుకుపోయింది. కీలక బ్యాట్స్‌మెన్ అంతా వరుసగా అవుట్ అవుతుండడంతో..

ఒక్కరన్‌కే డివిలియర్స్ అవుట్.. కష్టాల్లో ఆర్సీబీ

చెన్నై: సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూలు కష్టాల్లో కూరుకుపోయింది. కీలక బ్యాట్స్‌మెన్ అంతా వరుసగా అవుట్ అవుతుండడంతో ఆర్సీబీ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. దీనికి తోడు వరుస ఓవర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో.. 4 ఫోర్లు) ఏబీ డివిలియర్స్(1: 5 బంతుల్లో).. వరుస ఓవర్లలో అవుట్ కావడంతో ప్రస్తుతం మొత్తం భారం మ్యాక్స్‌వెల్(31 నాటౌట్: 26 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్సులు), వాషింగ్టన్ సుందర్(7: 7 బంతుల్లో.. 1 ఫోర్)పై పడింది. కాగా.. 14 ఓవర్లలో ఆర్సీబీ 6.85 రన్‌రేట్‌తో 94 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. 

Updated Date - 2021-04-15T02:10:43+05:30 IST