ఏబీసీడీ అర్థాల్లో ఎస్పీ ప్రత్యేకం: అమిత్ షా విమర్శలు

ABN , First Publish Date - 2021-12-28T20:45:24+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈ ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తోంది. ఒకవైపు విజయ యాత్ర పేరుతో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ దూసుకుపోతున్నారు..

ఏబీసీడీ అర్థాల్లో ఎస్పీ ప్రత్యేకం: అమిత్ షా విమర్శలు

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించి ఏబీసీడీ అనే అక్షరాలకు ఒక ప్రత్యేక అర్థముందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని హర్దోళిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆయన ఈ ప్రత్యేక అర్థాన్ని చెప్పుకొచ్చారు. ఏ అంటే అపరాద్ & ఆంతకవాదీ (అపరాధులు, దేశద్రోహులు) అని, బీ అంటే భాయి & భతీజావాద్ (తమ్ముడు, పిల్లలవాదులు) అని, సీ ఎంటే కరప్షన్ (అవినీతి) అని ఇక డీ అంటే దంగా (అల్లర్లు సృష్టించేవారు) అని అమిత్ షా చెప్పుకొచ్చారు.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈ ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తోంది. ఒకవైపు విజయ యాత్ర పేరుతో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ దూసుకుపోతున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్పీ అతి ఎక్కువ స్థానాలను గెలుచుకుని బీజేపీ, బీఎస్పీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. అఖిలేష్ దూకును ఆపి మరోమారు భారీ మెజారిటీతో యూపీలో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది.

Updated Date - 2021-12-28T20:45:24+05:30 IST