Abn logo
Sep 20 2021 @ 19:54PM

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి: అభయ్‌

దుమ్ముగూడెం: కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు ఈనెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట సోమవారం లేఖ విడుదలైంది. కేంద్రం మెడలు వంచుతూ పదినెలలుగా ఢిల్లీలో విజయవంతంగా కొనసాగుతున్న భారత రైతు పోరాటానికి విప్లవ జేజేలు తెలిపారు. పోరాట వేదిక వద్ద ఐదువేల స్టాల్స్‌ ఏర్పాటు చేసిన మహా పంచాయత్‌కు హాజరైన 22 రాష్ట్రాల రైతులకు ఉచిత సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. భారత రైతుల పాలిట మృత్యు గంటలు వినిపిస్తూ, కార్పొరేటు వర్గాల ప్రయోజనాలను ఈడేర్చ తలపెట్టిన సాగు చట్టాల రద్దుకు సాగుతున్న ఉద్యమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా పూర్తి అంకిత భావంతో పోరాడాలని యావత్‌ రైతులను అభయ్‌ కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption