May 17 2021 @ 23:47PM

ఓటీటీతో వసూళ్ల ఒత్తిడి పోయింది! అభిషేక్‌ బచ్చన్‌

‘‘ఓటీటీ వేదికల్లో విడుదలవుతున్న చిత్రాలు మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అందువల్ల, ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాలనే ఒత్తిడి ఉండదు. అలాగే, వసూళ్ల ఒత్తిడి పోయింది. తొలి రోజు ఎంత వసూలు చేసింది? వీకండ్‌ కలెక్షన్లు ఎంత? వంటివి లేవు’’ అని అభిషేక్‌ బచ్చన్‌ అన్నారు. గతేడాది ‘బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్‌’తో ఆయన ఓటీటీ వరల్డ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన నటించిన ‘లూడో’, ‘బిగ్‌ బుల్‌’ చిత్రాలు ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి.


థియేట్రికల్‌ రిలీజ్‌, ఓటీటీ రిలీజ్‌కు మధ్య వ్యత్యాసాన్ని అభిషేక్‌ బచ్చన్‌ వివిరిస్తూ... ‘‘వసూళ్ల ఒత్తిడి, తొలిరోజు చూడాలనే ఆసక్తి మినహా... మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. ప్రతి సినిమా విడుదల ముందు నెర్వస్‌కు లోనవుతా. థియేటర్లలో విడుదలయ్యేటప్పుడు నెర్వస్‌నెస్‌ 100 శాతం ఉంటే... డైరెక్టుగా ఓటీటీలో విడుదలయ్యేటప్పుడు 98 శాతం ఉంటుంది’’ అన్నారు.