Abn logo
Sep 22 2021 @ 00:49AM

రాజన్న క్షేత్రంలో అభిషేక పూజలు వాయిదా

వేములవాడ దేవస్థానం

వేములవాడ, సెప్టెంబరు 21 : రాజన్న సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో అభిషేక పూజలు వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా ఏడాది కాలంగా భక్తులను గర్భగుడిలోకి అనుమతించడం లేదు. ఫలితంగా గర్భాలయంలో భక్తులు రుద్రాభిషేకం పూజలు నిర్వహించడం సాధ్యం కాలేదు. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి అనువంశిక అర్చకులను, 21వ తేదీ మంగళవారం నుంచి భక్తులను అభిషేక పూజల కోసం గర్భాలయంలోకి అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి అనువంశిక అర్చకులు గర్భాలయంలో అభిషేక పూజల్లో పాల్గొంటున్నారు. 21వ తేదీ మంగళవారం నుంచి భక్తులను గర్భాలయంలో రుద్రాభిషేకం పూజల కోసం అనుమతించాల్సి ఉండగా కారణం లేకుండానే వాయిదా వేశారు. దీంతో రుద్రాభిషేకం పూజలో పాల్గొనడానికి వచ్చిన పలువురు భక్తులు నిరాశకు గురయ్యారు. 22వ తేదీ బుధవారం హుండీ లెక్కింపు ఉన్నందున రుద్రాభిషేకం పూజలను రెండు రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌ తెలిపారు. 23వ తేదీ గురువారం నుంచి భక్తులను గర్భాలయంలో రుద్రాభిషేకం పూజలకు అనుమతిస్తామని  స్పష్టం చేశారు.