పోలీసులతో ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్.. చీకటి దందా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-11-23T01:59:57+05:30 IST

నగరంలో మసాజ్ సెంటర్‌లలో జరుగుతున్న చీకటి దందాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేసి వెలుగులోకి తెచ్చింది. మహానగరంలో.

పోలీసులతో ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్.. చీకటి దందా గుట్టు రట్టు

హైదరాబాద్‌: నగరంలో మసాజ్ సెంటర్‌లలో జరుగుతున్న చీకటి దందాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేసి వెలుగులోకి తెచ్చింది. మహానగరంలో పుట్టగొడుగుల్లా మసాజ్, స్పా సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. బాడీ మసాజ్ పేరుతో లోపల చీకటి కార్యకలాపాలను నిర్వాహకులు యథేచ్ఛగా నిర్వయిస్తున్నారు. ఆన్ లైన్‌లో ఆకర్షణీయంగా ప్రకటనలు చేసి యువతకు గాలం వేస్తున్నారు. దీంతో నిఘా పెట్టిన ఏబీఎన్ లోపల జరుగుతున్న చీకటి దందాను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఏబీఎన్‌లో వచ్చిన కథనాలకు పోలీసులు స్పందించి స్పాలు, మాసాజ్ సెంటర్లు‌పై దాడులు చేసి కేసులు నమోదు చేశారు.


హైదరాబాద్ కేంద్రంగా స్పాలు, మసాజ్ సెంటర్‌లలో నడుస్తున్న వ్యభిచార దందాపై ఏబీఎన్ క్రైమ్ టీమ్ బట్ట బయలు చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు సైబరాబాద్ పోలీసులు స్పందించారు.  సైబరాబాద్ లిమిట్స్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను చెక్ పెట్టేందుకు ఏబీఎన్ క్రైమ్ టీమ్‌తో కలిసి పోలీసులు స్పా సెంటర్లపై దాడులు చేశారు. దీంతో అక్కడికి వెళ్లి తనిఖీలు చేయగా స్పా ముసుగులో వ్యభిచార దందా కొనసాగుతున్నట్లు విచారణలో తేలింది. 


ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్య‌లో స్పా సెంటర్లకు ఎలాంటి బోర్డులు లేకుండా స్పా ముసుగులో చీకటి దందా కొనసాగిస్తున్నారు .. జస్ట్ డయల్‌కి ఫోన్ చేసి స్పా సెంటర్లు సమాచారం అడిగిన వెంటనే.. ఫోన్ చేసిన సదరు వ్యక్తులు ఫోన్ నంబర్స్‌ను వీరితో లింక్ అయి ఉన్న స్పా సెంటర్లకు నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తి గత సమాచారాన్ని ఇచ్చేస్తున్నారు. దీంతో పది నిమిషాల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కాల్స్ చేసి , వారి వారి స్పాల ప్రత్యేకతలు చెప్పి కవ్విస్తున్నారు.  


హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఈ చీకటి దందాపై ప్రసారమైన కథనాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్ లిమిట్స్‌లోని మాదాపూర్ , కొండాపూర్‌తో పాటు మణికొండలో స్పాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. బాడీ టు బాడీ మసాజ్‌తోపాటు వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీపం‌లో ఉన్న స్పాపై దాడులు చేయగా, ఏబీఎన్, సైబరాబాద్ పోలీసులు చూసి ఇద్దరు యువకులు పరారు అయ్యారు. ఇక మరో స్పా సెంటర్‌లో ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏబీఎన్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బయట పడిన వీడియోలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు 

Updated Date - 2021-11-23T01:59:57+05:30 IST