Trouble Shooter అడుగుపెడితే ఓటమి గ్యారంటీనా.. హరీష్‌పై KCR గురి.. అభిమానుల్లో అనుమానాలు.. సీన్ రివర్స్ అయ్యిందేంటి..!?

ABN , First Publish Date - 2021-11-06T18:19:25+05:30 IST

పొలిటికల్‌ ట్రబుల్ ఫేస్‌ చేస్తున్న ఆనేత ఎవరు? ఆయనకిప్పుడు నడుస్తోన్న బ్యాడ్‌టైమ్‌ పార్టీలోనా..?..

Trouble Shooter అడుగుపెడితే ఓటమి గ్యారంటీనా.. హరీష్‌పై KCR గురి.. అభిమానుల్లో అనుమానాలు.. సీన్ రివర్స్ అయ్యిందేంటి..!?

ఆయన ప్రతాపం వారిపైనేనా? వీరిపై అస్సలు పనిచేయదా..? ఆ రెండు చోట్ల వారికి నిలువనీడ లేకుండా చేసి శభాష్‌ అని చప్పట్లు చరిపించుకున్న ఆ నేత ఇప్పుడు చడీచప్పుడు చేయకుండా ఉండాల్సివస్తుందా..? సీజన్‌ టూలో ఆయన ఇమేజ్‌ డమాల్‌మంటోందా? వరుసగా రెండుచోట్ల ఒకేపార్టీపై ఆయన మంత్రం పనిచేయకపోవడంలో మర్మేమేదైనా ఉందా..? పొలిటికల్‌ ట్రబుల్ ఫేస్‌ చేస్తున్న ఆనేత ఎవరు? ఆయనకిప్పుడు నడుస్తోన్న బ్యాడ్‌టైమ్‌ పార్టీలోనా..? ప్రజల్లోనా..? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


బీజేపీపై హరీష్‌ గన్‌ పేలడం లేదెందుకు?

బాధ్యతలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసినప్పుడు ట్రబుల్‌షూటర్‌గా జేజేలు పలికించుకునే హరీష్‌..తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినప్పుడు మాత్రం ఆయనపై సానుభూతి వ్యక్తమవుతూ కేసీఆర్‌ను కార్నర్ చేసేలా ప్రచారం రావడం ప్రత్యర్థిపార్టీలు వేసే ఎత్తుగడ అని టీఆర్‌ఎస్‌లోని కొన్నివర్గాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు. కాంగ్రెస్‌ నేతలపై పనిచేసిన హరీష్‌ వ్యూహాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎందుకుపనిచేయడం లేదనే అభిప్రాయాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి.


హరీష్‌పై కేసీఆర్‌కు గురి..!

హరీష్‌కు టీఆర్‌ఎస్‌లో ట్రబుల్‌ షూటర్‌ అనేపేరుంది. హరీష్‌ అయితేనే గెలిపిస్తానడే నమ్మకంతో కేసీఆర్‌ ఆయనకు బాధ్యతలు అప్పజెప్పుతారంటారు పార్టీలో మరోవర్గం. అనుకున్నట్లుగానే గత ఎన్నికల వరకు కాంగ్రెస్‌ నేతలను ఓ ఆట ఆడుకున్న హిస్టరీ హరీష్‌ సొంతం. ఫలానావాళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చూడాలి హరీష్‌ అని కేసీఆర్‌ కనుసైగ చేస్తే అలాగే మామా అంటు అనుకున్న పని పూర్తిచేసి శభాష్‌ అనిపించుకున్న సంఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు ఫైర్‌బ్రాండ్స్‌ డీకే అరుణ, రేవంత్‌రెడ్డీలను అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకుండా హరీష్‌ పన్నిన వ్యూహాలు, చేసిన ప్రచారాలు టీఆర్‌ఎస్‌ పార్టీయే కాదు రాజకీయాలు గమనించే ఎవరూ మర్చిపోలేని విషయాలు.


అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. యుద్ధమే..!

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావుకు, హరీష్‌కు అస్సలు పడదనే టాక్‌ పాత మెదక్‌జిల్లాలో ప్రచారంలో ఉన్నమాట. అలాగే హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్‌, హరీష్‌ ప్రాణమిత్రులన్నంత ప్రచారం టీఆర్‌ఎస్‌లో ఉండేది. హుజురాబాద్‌ పోరు పీక్‌ స్టేజ్‌లోకి వచ్చాక అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరు కాకుండా ఈటల వర్సెస్‌ హరీష్‌ అన్నట్లుగా ట్రబుల్‌షూటర్‌ కష్టపడ్డారు. ఈ రెండుచోట్ల పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిన హరీష్‌కు అసెంబ్లీలో ఈ బీజేపీ ఎమ్మెల్యేలు కనిపించినప్పుడల్లా తన ఓటమి గుర్తుకురాకతప్పదు.ప్రత్యర్థులు ఆయన రాజకీయ చాణక్యంపై ఈటలు గుచ్చకతప్పదు. మున్ముందు జరిగే ఎన్నికలకైనా, ఉప ఎన్నికలకైనా హరీష్‌రావును పంపిస్తే ఇక అంతే సంగతులనే ప్రచారం పార్టీలోనే కాదు ప్రత్యర్థుల్లోనూ వస్తుండటం ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసే పరిణామమే అనే విశ్లేషణలు వస్తున్నాయి.


కేసీఆర్‌పై హరీష్‌ ఫ్యాన్స్‌ అనుమానాలు!

టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావుకు జిందాబాద్‌కొట్టే కార్యకర్తలేకాదు, ఆమాటకొస్తే ఆంధ్రాతెలంగాణ అనేతేడాలేకుండా రెండురాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు, ఫాలోవర్లు కేసీఆర్‌పై ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గెలిచేచోట కేసీఆర్‌, కేటీఆర్‌లు రెక్కలుకట్టుకుని వాలిపోతూ ఓడిపోతామన్నచోటుకి హరీష్‌రావును పంపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ను హీరో చేసేందుకు, హరీష్‌రావును జీరో చేసేందుకు కేసీఆర్‌ వేస్తున్న ఎత్తుగడగా టీహెచ్‌ఆర్‌ ఫ్యాన్స్‌లో ఇన్‌సైడ్‌ టాక్‌ నడుస్తోంది.


పనిచేయని హరీష్‌ మ్యాజిక్‌!

రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికలైన దుబ్బాక, హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున కర్త, కర్మ, క్రియ అన్నట్లు బాధ్యతలు తీసుకోవాల్సివచ్చిన హరీష్‌ అక్కడ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. దుబ్బాకలో ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీకాగా,,హుజురాబాద్‌లో కారుగుర్తుపై గెలిచిన ఈటల రాజేందర్‌ పార్టీని వీడాల్సిన పరిస్థితుల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ హరీష్‌రావే..ఒక మాటలో చెప్పాలంటే అక్కడి స్థానిక అభ్యర్థులను రంగంలోకి దించినా పోటీలో ఉంది హరీష్‌రావే అన్నట్లు సీన్‌ క్రియేట్‌ అయింది. అయినా సిద్దిపేట హరీష్‌రావు అటు దుబ్బాకలోకాని, ఇటు హుజురాబాద్‌లో కాని కారును అసెంబ్లీవైపు తీసుకురాలేకపోయారు. దీంతో ప్రగతిభవన్‌లోనేకాదు, పల్లెల్లోనూ హరీష్‌రావుపై రకరకాల చర్చలు మొదలయ్యాయి.


హరీష్‌ అడుగుపడితే ఓటమి గ్యారంటీ!

టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌గా విమర్శకుల ప్రశంసలు పొందిన హరీష్‌రావుకు పొలిటికల్‌ కెరియర్‌లో బ్యాడ్‌టైమ్‌ నడుస్తోందా? రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేసీఆర్‌ తన పార్టీ తురుపుముక్క, మేనల్లుడు హరీష్‌రావును నమ్ముకుంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఓటమిని చవిచూడకతప్పలేదా? ఆ రెండు చోట్ల గెలిచిన పార్టీ ఒక్కటే కావడం కాకతాళీయమా? లేక కావాలనే జరిగిందా? ఓడిపోతామని తెలిసే కేసీఆర్‌ తన వ్యూహంలో భాగంగా హరీష్‌ రావును అక్కడికి పంపిస్తున్నారా? లేక మామకిచ్చిన మాటను నిలుపుకోవడంలో అల్లుడు హరీష్‌ మనసుపెట్టిపనిచేయడం లేదా?..


కొత్త రాజకీయం..!

హుజురాబాద్‌లో గెలిచి హైదరాబాద్‌కు వస్తూ మార్గమధ్యంలో సిద్దిపేట గడ్డపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల చేసిన వ్యాఖ్యలు హరీష్‌కు వార్నింగ్స్‌ అనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట ఇస్తున్న విజయాలతో రాష్ట్రనేతగా చక్రంతిప్పుతున్న హరీష్‌ సొంత ఇలాకాపై దృష్టిపెట్టాల్సిన అవసరం వస్తుందనే భావన క్రియేట్‌అవడం వెనుక ఆయనపై కొత్తరాజకీయం మొదలైనట్లేననే టాక్‌ వస్తోంది.


ఓటమి ఖాతా హరీష్‌పై వేయడం కుట్రా..?

ఇతర పార్టీల్లో ప్రచారం ఎలా ఉన్నా టీఆర్‌ఎస్‌లో మాత్రం హరీష్‌ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు గులాబీదళంలో ఏదో జరుగుతోందనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉంటున్నాయి. దుబ్బాకలోకాని, హుజురాబాద్‌లో కాని హరీష్‌తో పాటు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పర్యటించినా ఓటమికి బాధ్యత మాత్రం హరీష్‌రావుదే అన్నట్లు సెంటిమెంట్‌ క్రియేట్‌కావడం ఆయనకు మైనస్‌ అనే విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు హరీష్‌ ఇతర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రత్యర్థి పార్టీలను ఓడించేందుకు చేస్తున్న ప్రచారంతో ఒక్కటవుతున్న ప్రతిపక్షపార్టీలు వచ్చే ఎన్నికల్లో చలో సిద్ధిపేట, టార్గెట్‌ హరీష్‌ అన్నట్లుగా దండయాత్రకు సిద్దమవుతున్నాయి.



Updated Date - 2021-11-06T18:19:25+05:30 IST