సెప్టెంబర్‌లో Nara Lokesh అరెస్ట్.. Chandrababu తో రెండు సార్లు చెప్పిన మాజీ మంత్రి.. TDP లో హాట్ డిస్కషన్.. ఏం జరగబోతోంది..!?

ABN , First Publish Date - 2021-08-24T16:31:51+05:30 IST

జైలు నుంచి వచ్చిన ఆ నేత తన తర్వాత ఎవరు అరెస్ట్‌ అవుతారో జ్యోతిష్యుడు చెప్పినట్లు చెప్పేస్తున్నారు. ..

సెప్టెంబర్‌లో Nara Lokesh అరెస్ట్.. Chandrababu తో రెండు సార్లు చెప్పిన మాజీ మంత్రి.. TDP లో హాట్ డిస్కషన్.. ఏం జరగబోతోంది..!?

జైలు నుంచి వచ్చిన ఆ నేత తన తర్వాత ఎవరు అరెస్ట్‌ అవుతారో జ్యోతిష్యుడు చెప్పినట్లు చెప్పేస్తున్నారు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఆ నేత అరెస్ట్‌ తప్పదని ఆయన చెబుతున్న మాటలు ఆ పార్టీలోనే కాదు  రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ విషయం ఆయన ఎలా చెప్పగలుగుతున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంతకీ యువనేత అరెస్ట్‌ కోసం అపొజిషన్‌ ఎప్పుడు స్పాట్‌ పెట్టింది..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో చూద్దాం.


దేవినేని వ్యాఖ్యలపై హాట్‌హాట్‌ డిస్కషన్‌..

గుంటూరులో జరిగిన దళిత విద్యార్థిని హత్యపై బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. అయితే.. వచ్చెనెలలో మరోసారి లోకేష్ అరెస్ట్ అవుతారని మాజీ మంత్రి జోస్యం చెబుతున్నారు. కాగా.. ఎప్పటి నుంచో అటు తెలుగుదేశం, ఇటు కృష్ణాజిల్లా నేతలు ఊహిస్తున్న దేవినేని ఉమ అరెస్టు జరిగిపోయింది. ఉమ అరెస్టు జిల్లాలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, చివరకు ఆయన బెయిల్‌ పై తిరిగి వచ్చే సమయంలో పోలీసులే పరోక్షంగా ఆయనకు విపరీతమైన  ప్రచారం కల్పించారు. ఈ రెండు సంఘటనలు ఓ సంచలనం అయితే జైలు నుంచి బయటకు వచ్చిన దేవినేని ఉమ మరో బాంబు పేల్చారు. ఇప్పుడది తెలుగుదేశంలో హాట్‌టాపిక్‌ అవుతోంది.


చంద్రబాబుతో  రెండుసార్లు చెప్పిన మాజీ మంత్రి!

చంద్రబాబు విజయవాడకు వచ్చిన సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో దేవినేని ఉమ వెళ్లి స్వాగతం పలికారు. ఉమ ఇంటికి చంద్రబాబు వస్తానని చెప్పినప్పటికీ తానే ఎయిర్‌పోర్టుకు వస్తానని దేవినేని ఉమ చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో కూడా చంద్రబాబుకు లోకేష్ అరెస్టు విషయాన్ని మళ్లీ చెప్పారు. ఏం పరవాలేదు.. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్గంగా ఉన్నామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.


ఫైబర్‌నెట్‌ కేసులో ఇరికించే ప్రయత్నం చేసి..!

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించినప్పటికీ తాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఫైబర్‌నెట్‌ను  చూడలేదని ఆ శాఖతో తనకు సంబంధం లేదని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, ఐటీ, గ్రామీణాభివృద్ది శాఖలలో భూత అద్దం వేసి వెతికారని, ఏమీ లేకపోవడంతో కిమ్మనకుండా కూర్చున్నారని లోకేష్ వ్యాఖ్యానించారని తెలిసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ప్రచారం కూడా నిజం కాదని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చిన విషయాన్ని కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దేవినేని ఉమ, చంద్రబాబు కుటుంబ సభ్యులతో చెప్పడమే కాకుండా ఇదే అంశాన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గొల్లపూడిలో ఇంటికి చేరుకున్న సమయంలో కూడా మీడియాతో చెప్పారు.


తప్పు చేయనప్పుడు భయమెందుకు..!?

ఉమ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన వెంటనే ఆయనతో ఫోన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో  పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ సమయంలో నేరుగా ఆయన చంద్రబాబుతో పాటు లోకేష్, వారి కుటుంబ సభ్యులకు సెప్టెంబర్‌లో  లోకేష్‌ను అరెస్టు చేస్తారని చెప్పేశారు. కేసులు ఏమీ లేవు కదా... తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని చంద్రబాబు కుుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఎవరూ తప్పు చేయలేదని, కావాలనే కేసులు పెడుతున్నారని కూడా ఉమ వారికి వివరించారు. లోకేష్ మాత్రం తాను అన్నింటికీ సిద్దంగా ఉన్నానని, ఇప్పటికే ఈ అంశాన్ని కుటుంబ సభ్యులకు కూడా వివరించానని, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


తగ్గేదేలే అంటున్న లోకేష్‌!

లోకేష్ కూడా తనతో మాట్లాడిన వారందరికీ ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేయాల్సిందేనని, ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కుందామని చెబుతున్నారు. ఇటీవల లోకేష్ మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడే సమయంలో కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులకు నేను అన్ని విషయాలు చెప్పాను, అరెస్టుకు కూడా సిద్దమేనని చెబుతూ వచ్చారు.  దేవాన్ష్ మినహా అందరూ సిద్దంగా ఉన్నారు. తేల్చుకోవడానికి మేమంతా సిద్దంగా ఉన్నామని మీడియా ప్రతినిధుల వద్ద లోకేష్ చెప్పారు.


సెప్టెంబర్‌ ముహుర్తంపై హాట్‌ డిస్కషన్స్‌..!

ప్రస్తుతం దేవినేని ఉమ సెప్టెంబర్ ముహూర్తం పై తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు కుటుంబ సభ్యులలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. సహజంగా వైసీపీలోని అంతర్గత చర్చలను ఉమ తెలుగుదేశంలో సన్నిహితులతో చెబుతూ ఉంటారు. ఈ సారి బహిరంగంగానే లోకేష్ అరెస్టు బాంబు పేల్చడంతో యన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ అంశంపై ఉమను ఆరా తీస్తున్నారు.



Updated Date - 2021-08-24T16:31:51+05:30 IST