PSPKను ఎదుర్కొనేందుకు PK భారీ వ్యూహం.. నివేదికలొచ్చేశాయ్.. ఏం జరుగుతుందో..!

ABN , First Publish Date - 2021-11-05T18:46:41+05:30 IST

ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం...

PSPKను ఎదుర్కొనేందుకు PK భారీ వ్యూహం.. నివేదికలొచ్చేశాయ్.. ఏం జరుగుతుందో..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆ కమ్యూనిటీ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేసిందా..? వచ్చే ఎన్నికల వరకు ఎవరెటు ఉంటారో అని చెప్పే నివేదికలు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దగ్గరకు చేరుతున్నాయా..? పీఎస్‌పీకేను ఎదుర్కునేందుకు పీకే-ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహం రచించాలని చూస్తున్నారా..? తూర్పులో పవర్‌ స్టార్‌ సోషల్‌ ఇంజినీరింగ్‌ పాలిటిక్స్.. ఫ్యాన్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పవర్‌ పోయేలా చేస్తాయా..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


కాపుల్లో పవన్ మానియాపై జగన్ రెడ్డికి ఇన్‌ఫర్మేషన్

అధికార పార్టీకి ఇటువంటి అసంతృప్తులు ఉండటం సహజమేనని, వాటన్నింటినీ అధిగమించాల్సిన అవసరం ఉందని మరో నేత ముక్తాయింపు ఇచ్చారు. సమావేశంలో స్థూలంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు, కాపు సంఘాల స్పందన, వంటి అంశాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక ను ఖరారు చేసేందుకు అభిప్రాయాలను సేకరించారు. సీఎంకు నివేదించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని సమావేశాన్ని ముగించారు.. మరి మున్ముందు ఏం జరుగుతుందో ఏంటో..!


వైసీపీ అంతర్మథనం.. అసంతృప్తి!

మొత్తంగా ఈ సమావేశంలో మాత్రం వచ్చే ఎన్నికలలో కాపులు మెజార్టీ శాతం వైసీపీతో ఉండరనే నిర్ణయానికి వచ్చారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎవరిని దగ్గరకు తీయాలనే అంశంపై సమావేశంలో మేదోమథనం జరిపినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలలో సంక్షేమ పధకాలు అందని వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు విశ్లేషించారు. అయితే అనర్హులకు పధకాలు ఎలా మంజూరు చేస్తామని మరో నేత ప్రశ్నించినట్లు తెలిసింది.


పీకేను ఎదుర్కొనేందుకు పీకేకు బాధ్యతలు..!

పార్టీలోని కీలక నేతలంతా సమావేశమైన ఈ భేటీలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పినప్పటికీ ప్రశాంత్ కిషోర్ బృందానికి ఈ పని అప్పచెప్పాలని మరికొందరు సూచించారు. అయితే కాపులను బుజ్జగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా ఈసమావేశంలో చర్చ జరిగినప్పటికీ ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వద్దామని భావించినట్లు తెలిసింది. పైగా రానున్న ఎన్నికలలో జనసేన... ఇప్పటికే బీజేపీకి దూరం అవుతుందని, టీడీపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని ఓ నేత ఈ సమావశంలో వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ ను ఇప్పటి నుంచే దమ్ము ఉంటే ఒంటరిగా రా అని సవాల్ చేయాలని వైసీపీ మంత్రులు, అధికార పార్టీ ప్రతినిధులకు గీతోపదేశం చేశారు. అందుకనే రెండు రోజుల నుంచి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి రావాలని సవాల్ చేస్తున్నారు.


పవన్‌కు అండగా కాపు సంఘాలు.. వైసీపీలో భయం 

కాపు సంఘాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవడంతో అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ, తాడేపల్లిలో జరిగిన అంతర్గత సమావేశాలలో కీలక నేతలు, కాపులు వచ్చే ఎన్నికలలో మన వైపు ఉండే అవకాశం లేదని నేతలకు చెప్పినట్లు తెలిసింది. సంక్షేమ పధకాలు అందని కొన్ని వర్గాలు కూడా పార్టీకి దూరమవుతున్నాయని, కాపులు కూడా దూరమైతే ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలని మేదోమథనం చేశారు. గత ఎన్నికల్లో విజయం కోసం ఒక సంవత్సరం ముందు కులాల పై దృష్టి సారించి విజయం సాధించామని, ఈ సారి వచ్చే ఎన్నికల కోసం రెండు సంవత్సరాల ముందు నుంచే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని కీలక నేత ఒకరు దిశానిర్దేశం చేశారు.


పేర్ని నానిపై విరుచుకుపడ్డ కాపు సంఘాలు.. రాధా కూడా!

ఇదే సమయంలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాపులను గురించి చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు విరుచుకు పడ్డాయి. పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడ్డాయి. కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య అయితే మరో అడుగు ముందుకేసి రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వంగవీటి రంగా తనయుడు రాధా కూడా పరోక్షంగా మంత్రి పేర్ని నానిపై  సెటైర్లు వేశారు.


జగన్‌ రెడ్డికి సవాల్ విసురుతున్న పవన్!

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు ఒకొక్కటిగా వైసీపీకి ఆందోళ కలిగిస్తున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాల తర్వాత రోడ్ మీదకు వచ్చి చూసుకుందాం రా.. అని సవాల్ చేశారు. ఇక రహదారులపై పడిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పైగా తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడిన నేతలు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ మౌలిక ప్రశ్నలను లేవనెత్తారు. దీనిపై ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చ ప్రారంభమైంది.


గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసిన కాపులు!

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అపూర్వ రీతిలో పట్టం కట్టారు. 51శాతం ఓట్లు, 151 అసెంబ్లీ సీట్లు,  22 లోక్ సభ నియోజకవర్గాలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు కాపులలో మెజారిటీ గ్రూపు, తటస్థులు ఒక్కఛాన్స్ పేరుతో జగన్ కు ఓట్లు వేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ నిర్వహించిన పాదయాత్రలో సాక్షాత్తు తూర్పుగోదావరి జిల్లాలోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పినప్పటికీ, ఆ తర్వాత సర్దుబాటు చేసినా కూడా కాపులు ఆయనకే పట్టం కట్టారు.



Updated Date - 2021-11-05T18:46:41+05:30 IST