Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ పేరుతో సచివాలయ సిబ్బంది నిర్వాకంపై ABN కథనాలు

విజయనగరం: ఓటీఎస్‌ పేరుతో సచివాలయ సిబ్బంది నిర్వాకంపై ABNలో వరుస కథనాలు రావడంతో ఎమ్మెల్యే స్పందించారు. ఓటీఎస్‌ పేరుతో పేదలపై అధికారులు, ప్రజా ప్రతినిధుల చెలగాటంపై కథనాలను ప్రసారం చేసింది. తన కొడుకు చికిత్సకు దాచిన డబ్బులను కూడా ఓటీఎస్ పేరుతో సచివాలయ సిబ్బంది లాక్కున్నారని బాధితురాలు భారతి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ABN ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అయ్యాయి. వీటికి స్పందించి స్థానిక నేతలతో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. తమ నుంచి బలవంతంగా సచివాలయ సిబ్బంది ఓటీఎస్ ద్వారా ఇంటి రుణం చెల్లించుకోలేదని, ఇష్టపూర్వకంగానే డబ్బుకట్టామని బాధితురాలితో ఎమ్మెల్యే చెప్పించారు. Advertisement
Advertisement