మోదీ కంట్రోల్లోకి IASలు.. ఆందోళనలో రాష్ట్రాలు..

ABN , First Publish Date - 2022-01-26T19:30:31+05:30 IST

రాష్ట్రాలకు సంబంధం లేకుండా... రాష్ట్రాల ప్రమేయం లేకుండా... రాష్ట్రాలు అంగీకరించకపోయినప్పటికీ...

మోదీ కంట్రోల్లోకి IASలు.. ఆందోళనలో రాష్ట్రాలు..

హైదరాబాద్: రాష్ట్రాలకు సంబంధం లేకుండా... రాష్ట్రాల ప్రమేయం లేకుండా... రాష్ట్రాలు అంగీకరించకపోయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన అధికారులను కొత్తగా తీసుకొచ్చిన సవరణల ద్వారా నేరుగా కేంద్రానికి పిలుపించుకునే అవకాశముంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నేరుగా రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్లో పెట్టుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇది ఫెడరల్ వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటి నిర్ణయమంటూ కామెంట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశానికి సంబంధించి పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ నెల 27వ తేదీ (గురువారం) లోపు అభిప్రాయాలు చెప్పాలంటూ రాష్ట్రాలను కేంద్రం కోరింది. దొడ్డిదారిన రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకు కేంద్రం చేస్తున్న చర్యగా రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. పలువురు నేతలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2022-01-26T19:30:31+05:30 IST