ఏబీఎన్ ఎఫెక్ట్.. దుర్గగుడి అధికారుల్లో కదలిక

ABN , First Publish Date - 2021-08-02T21:22:53+05:30 IST

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ కుంగిపోవడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలతో..

ఏబీఎన్ ఎఫెక్ట్.. దుర్గగుడి అధికారుల్లో కదలిక

విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ కుంగిపోవడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలతో దుర్గగుడి అధికారుల్లో కదలిక వచ్చింది. దాంతో వారు మరమత్తు పనులు చేపడుతున్నారు. అయితే దుర్గమ్మ దర్శనానికి వెళ్లే ఘాట్ రోడ్ కొన్ని నెలలుగా కుంగిపోతోంది. రోడ్డు మధ్యలో సగభాగం లోపలికి కుంగిపోయింది. తాత్కాలిక మరమత్తులు చేపట్టి వదిలేస్తున్నారు. ఇదే మార్గంలో భక్తులు వాహనాలతోపాటు దేవస్థానం బస్సులు వెళుతుంటాయి.


గత ఏడాది ఇంద్రకిలాద్రిపై కొండచరియలు విరిగిపడడంతో సీఎం జగన్ అభివృద్ధి పనుల కోసం రూ. 70 కోట్లు విడుదల చేశారు. కానీ ఆ పనులు ముందుకు సాగడంలేదు. ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులపై ఏబీఎన్‌లో వచ్చిన కథనాలతో స్పందించిన దుర్గగుడి అధికారులు మరమత్తుల కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈసారి కూడా పైపైన సిమ్మెంట్ రాసి వదిలేసే కార్యక్రమం చేపట్టారు.

Updated Date - 2021-08-02T21:22:53+05:30 IST