ABN Effect: గణేష్ విగ్రహాల తరలింపు కథనాలకు స్పందన

ABN , First Publish Date - 2021-09-07T21:53:05+05:30 IST

గణేష్ విగ్రహాల తరలింపుపై ఏబీఎన్ ప్రసారం చేసిన కథనాలపై కమిషనర్ అనురాధ స్పందించారు.

ABN Effect: గణేష్ విగ్రహాల తరలింపు కథనాలకు స్పందన

గుంటూరు: నగరంలో గణేష్ విగ్రహాల తరలింపుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ స్పందించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఐడీ ఆస్పత్రి దగ్గర విగ్రహాలను తొలగించడాన్ని ఆమె తప్పుపట్టారు. శానిటరీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. వినాయక విగ్రహాలను చెత్తబండిపై ఎక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు.


Updated Date - 2021-09-07T21:53:05+05:30 IST