దమ్మున్న ఆర్కేపై బ్రీత్ లెస్ కామెంటరీ

ABN , First Publish Date - 2021-06-20T03:03:42+05:30 IST

దమ్మున్న ఆర్కేపై బ్రీత్ లెస్ కామెంటరీ

దమ్మున్న ఆర్కేపై బ్రీత్ లెస్ కామెంటరీ

ఆంధ్రజ్యోతి దమ్మున్న ఛానల్.. తెలుగునాట సంచలనాలకు వేదిక. అధికార బలానికి వెరవని నైజం.. సమాజహితం కోసం ప్రతినిత్యం పాకులాడే స్వభావం. అంతటి సంస్థను ముందుండి నడిపిస్తున్న శక్తి వేమూరి రాధాకృష్ణ. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు ఆర్కే. ఎవరు అవునన్నా.. కాదన్నా... ఆయనకు ఆయనే సాటి. తన అక్షరంతో.. సూటైన ప్రశ్నలతో.. జర్నలిజానికి సరికొత్త నిర్వచనమయ్యారు. ఆయనపై తనకున్న ప్రేమను చాటుతూ.. ఓ అభిమాని పది నిమిషాలపాటు బ్రీత్ లెస్ కామెంటరీతో అదరగొట్టాడు.


‘‘ఎన్ని రాజకీయ గద్దలు గద్దించినా.. తలదించి, వెన్నుచూపించి, కలం బలం తగ్గించి... అక్షరాల లక్షణాలను మార్చబోము. అవినీతిపరుల అంచున చేరి... సంచుల కోసం ఆంధ్రజ్యోతిని ఆర్పబోము. తెలుగు నేలను, తెలుగు తల్లిని, తెలుగుభాషను మరువబోము. ఆంధ్రుల ఆశాజ్యోతి.. తెలంగాణ అక్షరజ్యోతి... ఆంధ్రజ్యోతి ప్రజల కోసం గర్జిస్తుంది’’ అంటూ గుండెల నిండా దాచుకున్న అభిమానాన్ని చాటాడు. వీడియోలో ఆ వాక్ప్రవాహాన్ని వినగలరు. 



Updated Date - 2021-06-20T03:03:42+05:30 IST