Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీటీడీలో ఉద్యోగాల మోసంపై ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్‌

తిరుపతి: నిరుద్యోగులకు టీటీడీలో జరుగుతున్న ఉద్యోగాల మోసంపై  ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్‌ నిర్వహించింది.  టీటీడీ ఉద్యోగుల పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని పట్టుబడ్డ మోసగాళ్లపై టీటీడీ ఫిర్యాదు చేసింది. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదుతో శరవణ, సుందరదాస్‌లపై తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో  పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని టీటీడీ పేర్కొంది. టీటీడీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేప్పుడు ముందుగా పత్రికల్లో, టీటీడీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ ఇస్తామని టీటీడీ తెలిపింది. 

Advertisement
Advertisement