Feb 2 2020 @ 19:52PM

‘విశ్వ‌క్‌’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

v id="pastingspan1">
అజ‌య్ క‌థుర్వ‌ర్‌, డింపుల్ హీరో హీరోయిన్లుగా గోల్డెన్ డ‌క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ముల్క‌ల ద‌ర్శ‌క‌త్వంలో తాటికొండ ఆనందం బాల‌క్రిష‌న్ నిర్మిస్తోన్న చిత్రం ‘విశ్వ‌క్‌’. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్‌లోని పేప‌ర్ క‌టింగ్స్‌, వాటిని ఓ బోర్డ్‌కు పిన్ చేసిన‌ట్లు ఉండ‌టం.. ఇవ‌న్నీచూస్తుంటే ‘విశ్వ‌క్‌’ ఒక డిఫ‌రెంట్ మూవీ అనేది తెలుస్తుంది.
 
ప్ర‌పంచ వాణిజ్యాన్ని శాసించే స్టార్ట‌ప్ కంపెనీల క‌థాంశంతో విశ్వ‌క్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇండియాలో ప్రారంభ‌మైన కొన్ని స్టార్ట‌ప్ కంపెనీలు, వాటిని స్థాపించిన యువ‌త ఎలాంటి సవాళ్ల‌ను ఎదుర్కొన్నారు. అర్బ‌న్ ఇన్‌ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ ఎలా ఉంటుంద‌నే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజ‌ర్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స‌త్య‌సాగ‌ర్ సంగీతం, ప్ర‌దీప్ దేవ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.