రాగి జంతికలు

ABN , First Publish Date - 2015-09-02T17:50:18+05:30 IST

కావలసిన పదార్థాలు: రాగిపిండి - 1 కప్పు, వేగించిన మినప్పిండి - పావు కప్పు, బియ్యప్పిండి

రాగి జంతికలు

కావలసిన పదార్థాలు: రాగిపిండి - 1 కప్పు, వేగించిన మినప్పిండి - పావు కప్పు, బియ్యప్పిండి - 4 టేబుల్‌ స్పూన్లు, వెన్న - అర కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, ఎండుమిర్చి - 2, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: మిక్సీలో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లితరుగు ఒకటి తర్వాత ఒకటి వేసి పేస్టు చేసుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో రాగిపిండి, మినప్పిండి, బియ్యప్పిండి, ఉప్పు, కరిగించిన వెన్న, ఉల్లి మిశ్రమం వేసి తగినంత నీరు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత నూనెలో జంతికల్లా వేసి దోరగా వేగించాలి.

Updated Date - 2015-09-02T17:50:18+05:30 IST