పొంగణాలు

ABN , First Publish Date - 2015-09-02T17:45:21+05:30 IST

కావల్సినవి: బియ్యం - 200 గ్రాములు, మినప్పప్పు - 100 గ్రాములు, మెంతులు - 1/2 స్పూన్‌, ఉప్పు

పొంగణాలు

కావల్సినవి: బియ్యం - 200 గ్రాములు, మినప్పప్పు - 100 గ్రాములు, మెంతులు - 1/2 స్పూన్‌, ఉప్పు - తగినంత, పై వన్నీ కలిపి రెండు గంటలసేపు నానబెట్టాలి. దీనికి తగినంత ఉప్పు కలపి మెత్తగా రుబ్బాలి.
ఇవి సిద్ధం చేసుకోవాలి: నువ్వుల నూనె - 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర, ఆవాలు - 1 టేబుల్‌స్పూన్‌, కరివేపాకు - 1 రెబ్బ, ఉల్లిపాయ - 1 (తరిగినది), కొబ్బరి - 50 గ్రాములు (తురిమినది).
తయారీ విధానం:
నువ్వుల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేయించాలి. తరువాత కొబ్బరి తురుమును కూడా కలిపి వేయించి బియ్యం పిండిలో కలపాలి. పొయ్యిపై పొంగణాల పెనం పెట్టి వేడిచేసి నువ్వుల నూనె వేసుకుంటూ గరిటెతో పై మిశ్రమాన్ని పోస్తూ దోరగా వేయించాలి. ఇలా తయారయిన పొంగణాలను పల్లి చట్నీతో గానీ, అల్లం చట్నీతోగానీ వేడివేడిగా వడ్డించడమే తరువాయి.

Updated Date - 2015-09-02T17:45:21+05:30 IST