ఉసిరి పులిహోర

ABN , First Publish Date - 2015-09-02T18:17:37+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - 100 గ్రా., పెద్ద ఉసిరికాయ -1, వెల్లుల్లి - 4 రేకలు, పచ్చిమిర్చి

ఉసిరి పులిహోర

కావలసిన పదార్థాలు: బియ్యం - 100 గ్రా., పెద్ద ఉసిరికాయ -1, వెల్లుల్లి - 4 రేకలు, పచ్చిమిర్చి - 4, పసుపు - పావు టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. తాలింపు కోసం: శనగపప్పు - 1 టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, పల్లీలు - గుప్పెడు, జీడిపప్పు - 8, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: బియ్యం పొడిగా, కాస్త గట్టిగా వండి ఆరబెట్టుకోవాలి. ఉసిరి ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో తాలింపు దినుసులు వేగాక, ఉసిరి మిశ్రమం, ఉప్పు వేసి ఒక నిమిషం తర్వాత అన్నంలో బాగా కలుపుకోవాలి.

Updated Date - 2015-09-02T18:17:37+05:30 IST