రవ్వ అప్పాలు

ABN , First Publish Date - 2016-10-09T18:22:03+05:30 IST

ఉప్మారవ్వ, పంచదార - ఒక్కోటి అరకప్పు చొప్పున, నీళ్లు - ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము - ఒక టేబుల్‌ స్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, నూనె - వేగించడానికి సరిపడా.

రవ్వ అప్పాలు

కావలసినవి: ఉప్మారవ్వ, పంచదార - ఒక్కోటి అరకప్పు చొప్పున, నీళ్లు - ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము - ఒక టేబుల్‌ స్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, నూనె - వేగించడానికి సరిపడా.

 
తయారీ:
ఉప్మారవ్వను సన్నటి మంట మీద రెండు నిమిషాలు వేగించి పక్కన పెట్టాలి.
ఒక కప్పు నీళ్లను బాగా మరిగించి అందులో వేగించిన ఉప్మారవ్వ వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కలపాలి. తరువాత పంచదార వేసి కలిపాక నెయ్యి, కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి కలపాలి.
స్టవ్‌ మంట తగ్గించి మూత పెట్టి మిశ్రమం చిక్కగా అయ్యే
వరకు ఉడికించాలి.
స్టవ్‌ ఆపేసి ఉడికిన మిశ్రమాన్ని కదపకుండా ఐదు నిమిషాలు అలానే ఉంచాలి. తరువాత మూత తీసి చల్లార్చాలి.
చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకుని ఉడికించిన మిశ్రమాన్ని ముద్దలా చేయాలి. తరువాత నిమ్మకాయ సైజంత ఉండలు చేసి వాటిని రెండు అరచేతుల మధ్య ఉంచి గారెల్లా వత్తాలి.
పాన్‌లో నూనె వేడిచేసి వత్తిన అప్పాలను బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. అప్పాలు నూనెలో వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కునేలా ఎక్కువ వేయొద్దు

Updated Date - 2016-10-09T18:22:03+05:30 IST