పేలాలతో వడియాలు

ABN , First Publish Date - 2018-05-12T21:29:10+05:30 IST

పేలాలు-500 గ్రాములు, సగ్గుబియ్యం-పావు కప్పు, పచ్చిమిర్చి-30 గ్రాములు, వాము-ఒక టేబుల్‌స్పూను, ఉప్పు-సరిపడా...

పేలాలతో వడియాలు

కావలసినవి
 
పేలాలు-500 గ్రాములు, సగ్గుబియ్యం-పావు కప్పు, పచ్చిమిర్చి-30 గ్రాములు, వాము-ఒక టేబుల్‌స్పూను, ఉప్పు-సరిపడా.
 
తయారీవిధానం
 
ఒకటిన్నర కప్పు నీళ్లల్లో సగ్గుబియ్యాన్ని రెండు గంటలు నానబెట్టాలి. నానబెట్టిన నీళ్లలోనే సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. చిక్కగా అయ్యేవరకూ ఆ మిశ్రమాన్ని కలపాలి.
అందులో వాము వేసి బాగా కలిపి స్టవ్‌ మీద నుంచి దించి పక్కనపెట్టాలి. పెద్ద గిన్నెలో అర కప్పు పేలాలు పోసి ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. మిగిలిన సగం పేలాలతోపాటు మరో కప్పు నీళ్లను కూడా అందులో కలిపి పది నిమిషాలు అలాగే ఉంచాలి.
పచ్చిమిరపకాయలను సన్నటి ముక్కలుగా తరగాలి. నానిన పేలాలలో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఉడికించిన సగ్గుబియ్యాన్ని పేలాల మిశ్రమంలో పోసి బాగా కలపాలి. ఒక ప్లాస్టిక్‌ షీటుపై ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా పెట్టాలి.
అలా పిండి మొత్తాన్ని వడియాలుగా పెట్టాలి. వీటిని బాగా ఎండనివ్వాలి.
వేగించిన పేలాల వడియాలను సాంబారన్నంతో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి.

Updated Date - 2018-05-12T21:29:10+05:30 IST