జంతికలు

ABN , First Publish Date - 2018-01-13T18:10:25+05:30 IST

నీళ్లు- సరిపడినన్ని, వెన్న- ఒక టేబుల్‌స్పూను, కారం- ఒక టీస్పూను, నువ్వులు- ఒక టేబుల్‌స్పూను...

జంతికలు

కావలసినవి
 
నీళ్లు- సరిపడినన్ని, వెన్న- ఒక టేబుల్‌స్పూను, కారం- ఒక టీస్పూను, నువ్వులు- ఒక టేబుల్‌స్పూను, నూనె- సరిపడినంత, మినపప్పు- ఒక కప్పు, బియ్యప్పిండి- నాలుగు కప్పులు, వాము- ఒక టీస్పూను.
 
తయారీవిధానం
 
పాన్‌ తీసుకుని నూనె లేకుండా మినపప్పు వేగించి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, మినప్పిండి, నువ్వులు, వాము, తగినంత ఉప్పు, కారం, వెన్న వేసి బాగా కలిపి తగినంత నీళ్లు పోసి మెత్తటి పిండిలా చేయాలి. జంతికల ప్రెస్‌ తీసుకుని అందులో పిండి పెట్టి పిండిని చుట్టల్లా నూనెలో వేసి బంగారురంగు వచ్చేదాకా వేగించాలి. ఇలా మిగతా పిండిని కూడా చేయాలి.

Updated Date - 2018-01-13T18:10:25+05:30 IST