కావలసినవి : బెండకాయలు ఐదు, పెరుగు ఒక కప్పు కారం పావు టీస్పూను, వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూను, కొత్తిమీర కొంచెం, ఉప్పు చక్కెర తగినంత.
ఎలా చేయాలి
బెండకాయ చివర్లు తీసేసి రెండు ముక్కలుగా కోసుకోండి. వీటిని నూనెలో దేవేసి న్యూస్పేపర్ మీద వేయండి. నూనె పీల్చేస్తుంది. ఈలోగా పెరుగు చిలక్కొట్టి కారం, జీరా పొడి, ఉప్పు చక్కెర కలుపుకోండి. తర్వాత బెండ ముక్కల్ని వేసి పైన కొత్తిమీర చల్లుకోండి. ఎండా కాలంలో తినడానికి చాలా హాయిగా ఉంటుంది.